Tata Motors: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ బంపరాఫర్

4 Oct, 2022 13:29 IST|Sakshi

ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ కొనుగోలు దారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా కొనుగోలు దారులకు టాటా టియాగో, టైగోర్‌,టైగోర్ సీఎన్జీ, హారియ‌ర్‌, స‌ఫారీ కార్ల‌పై పలు ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. 

దేశంలో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న కార్ల‌లో రెండో స్థానంలో టాటా హారియ‌ర్‌పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ ,రూ.5000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తుంది. దీంతో పాటు టైగోర్ సీఎన్జీపై ఎక్స్చేంజ్ ఆఫర్‌ రూ.15,000 , రూ.10 వేలు డిస్కౌంట్ అందిస్తున్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు. అన్ని టాటా స‌ఫారీ వేరియంట్ల‌పై రూ.40 వేల వరకు  ఎక్స్ఛేంజ్ క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.  

టైగోర్‌పై ఎక్స్ఛేంజ్ బోన‌స్‌గా రూ.10 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 బెనిఫిట్ ల‌భిస్తుంది. టాటా టియాగోపై ఎక్స్చేంజ్ బోన‌స్‌గా రూ.10వేలు, క్యాష్ డిస్కౌంట్‌గా రూ.10 వేలు బెనిఫిట్ పొంద‌వ‌చ్చు. హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.3000 అందిస్తున్న‌ది.

మరిన్ని వార్తలు