గుడ్‌న్యూస్‌...పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్‌...!

10 Apr, 2022 22:05 IST|Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏప్రిల్‌ నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను టాటా మోటార్స్‌ విడుదల చేసింది. Tiago , Tigor , Harrier , Safari వంటి టాటా కార్లపై ఈ నెలలో కస్టమర్‌లు రూ. 65,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీలపై ఎలాంటి ఆఫర్లు లేవు. కాగా  ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌, నగదు మార్పిడి బోనస్‌, కార్పొరేట్ బోనస్‌ రూపంలో ఉండనున్నాయి. 

టాటా మోటార్స్ ఆయా కార్లపై అందిస్తోన్న ఆఫర్స్‌..!

టాటా మోటార్స్‌ ఇటీవలే టాటా హారియర్ కొత్త ఎడిషన్ కాజిరంగాను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రత్యేక ఎడిషన్‌పై ఎలాంటి తగ్గింపు ఆఫర్స్‌ లేవు.  హారియర్‌ అన్ని వేరియంట్‌లపై రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా గరిష్టంగా రూ. 65,000 వరకు తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. 

 టాటా సఫారీ అన్ని మోడళ్లలో రూ. 45,000 వరకు ప్రయోజనాలతో రానుంది. ఈ కారుపై కార్పోరేట్‌ తగ్గింపు లభించదు.

 టాటా టిగోర్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో పనిచేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ వేరియంట్‌పై రూ.21,500 వరకు తగ్గింపుతో అందించబడుతోంది. దాంతో పాటు అదనంగా రూ. 10,000 తగ్గింపు కూడా అందిస్తుంది. టాటా టిగోర్‌ అన్నీ వేరియంట్లపై రూ. 11,500 కార్పొరేట్ తగ్గింపు లభిస్తాయి. 

 టాటా టియాగో కొనుగోలుపై  రూ. 31,500 వరకు తగ్గింపును టాటా మోటార్స్‌ అందిస్తోంది. ఇందులో అన్ని వేరియంట్‌లకు రూ. 11,500 కార్పొరేట్ తగ్గింపు లభించనుంది. అయితే, సీఎన్‌జీ వేరియంట్స్‌పై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్‌ లేవు. 

 టాటా నెక్సాన్‌ పెట్రోల్‌ వేరియంట్‌పై రూ. 6,000, డీజిల్ నెక్సాన్‌పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపులను అందిస్తోంది టాటా మోటార్స్‌.

చదవండి: బంపరాఫర్‌..! కారు కొనుగోలుపై ఏకంగా రూ. లక్షకు పైగా తగ్గింపు..!

మరిన్ని వార్తలు