నష్టాల్లో టాటా మోటార్స్‌

1 Nov, 2021 19:38 IST|Sakshi

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.314 కోట్లతో పోలిస్తే టాటా మోటార్స్ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,441 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ రూ.4,450.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇది ఇలా ఉంటే కంపెనీ ఆదాయం క్యూ2ఎఫ్ వై222లో సుమారు 15 శాతం పెరిగి రూ.61,379 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్యూ2ఎఫ్ వై21లో కంపెనీ ఆదాయం రూ.53,530 కోట్లగా ఉంది. 

త్రైమాసిక ఫలితాల ప్రకటనలో కంపెనీ ఏకీకృత ఈబీఐటీడీఏ మార్జిన్ 210 బేసిస్ పాయింట్లు(బిపిఎస్) 8.4 శాతానికి తగ్గిందని నివేదించింది. జెఎల్ఆర్ మార్జిన్ కూడా 380 బిపిఎస్ తగ్గి 7.3 శాతానికి పడిపోయింది. సరఫరా విషయంలో అంతరాయం, జాగ్వార్ & ల్యాండ్ రోవర్ అమ్మకాలు క్షీణించడం, కమోడిటీ ద్రవ్యోల్బణం ఈ త్రైమాసికంలో టాటా మోటార్స్ ఆదాయంపై ప్రభావం చూపాయి. గత ఏడాదితో పోలిస్తే భారతదేశంలో టాటా మోటార్స్ కార్యకలాపాలు బాగున్నాయని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారం దాదాపు మూడు రెట్లు వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. సెమీకండక్టర్ సమస్యలు, కమోడిటీ ద్రవ్యోల్బణం వల్ల నష్టం వచ్చినట్లు పేర్కొంది.

(చదవండి: దేశీయ ఈవీ మార్కెట్లో చైనా కారు విడుదల.. రేంజ్ ఎంతో తెలుసా?)

మరిన్ని వార్తలు