దేశంలో సంక్షోభం, టాటా మోటార్స్‌ మరో మైలురాయి

27 Jul, 2021 14:14 IST|Sakshi

ప్రముఖ ఆటోమోబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ మరో మైలు రాయిని చేరుకుంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తినా దిగ్గజ ఆటోమోబైల్‌ సంస్థ వాహనాల్ని రికార్డ్‌ స్థాయిలో మార్కెట్‌లో విడుదల చేసింది. పూణే కేంద్రంగా కేవలం నాలుగు నెలల్లో భారీ ఎత్తున వాహనాల్ని మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. 

శైలిష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి నెలకు ఎస్‌యూవీ సఫారీ వాహనాల్ని 100వాహనాల్ని విడుదల చేసినట్లు, నాలుగు నెలలో 9,900వాహనాల్ని పూణే ప్లాంట్‌ నుంచి విడుదల చేసినట్లు వెల్లడించారు. దేశంలో గడ్డు పరిస్థితులు తలెత్తినప్పటికీ వాహనాల తయారీలో రికార్డ్‌ క్రియేట్‌ చేశామని అన్నారు. 

 టాటా మోటార్స్ ఇంపాక్ట్ 2.0 డిజైన్ లో సఫారి తన కొత్త మోడల్‌ ఒమేగార్క్ ప్లాట్‌ఫామ్‌ వినియోగదారుల్ని ఆకట్టుకుందని, డి 8 ప్లాట్‌ఫామ్ నుండి పొందిన  ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్‌ విభాగంలో ముందజలో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టాటామోటార్స్‌ డిజైన‍్లను మారుస్తుందని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర చెప్పారు.      

మరిన్ని వార్తలు