కార్‌ లవర్స్‌కు టాటా మోటార్స్‌ తీపికబురు

18 Mar, 2021 14:34 IST|Sakshi

 సాక్షి, ముంబై:  దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ కార్‌ లవర్స్‌కు  తీపి కబురు అందించింది. వివిధ మోడల్‌ కార్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది.  కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో టాటా మోటార్స్ మార్చి నెలలో తగ్గింపులను వెల్లడించింది.  తన అధికారిక వెబ్‌సైట్‌లో  అందించిన వివరాల ప్రకారం టియాగో, టైగోర్, నెక్సాన్ , 5-సీట్ల హారియర్‌తో సహా ఎంపిక చేసిన కార్లపై  65 వేల రూపాయల  వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31, 2021 వరకు  అందుబాటులో ఉంటాయి.    కన్జ్యూమర్‌ స్కీమ్‌, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌, కార్పొరేట్‌ స్కీమ్‌ల రూపంలో వీటిని అందిస్తోంది.

టాటా టియాగో మోడల్‌పై రూ.25వేలను తగ్గింపు అందుబాటులో ఉండనుంది.  వీటిల్లో కన్జ్యూమర్‌ స్కీమ్‌ రూ.15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ రూ.10 వేలు ఉన్నాయి. టిగారో సెడాన్‌పై మొత్తం 30వేలుతగ్గింపు. ఇందులో కన్జ్యూమర్‌ స్కీమ్‌లో రూ. 15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌లో రూ.15 వేలు డిస్కౌంట్‌  భాగం.

నెక్సాన్ సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీపై రూ.15వేలు డిస్కౌంట్‌ లభిస్తోంది.  అయితే గమనించాల్సిన విషయం ఏమంటే ఈకారు డీజిల్‌ వెర్షన్‌పై ఎక్స్‌ఛేంజి ఆఫర్‌తో మాత్రమే ఈ ఆఫర్‌ లభ్యం.  ఇక  హారియర్‌ 5సీట్ల మోడల్‌ క్యామో వేరియంట్‌పై మాత్రం రూ.40వేలు లభిస్తోంది. హారియర్‌లో పరిమిత వేరియంట్లకే ఆఫర్‌ను అందిస్తోంది.  సాధారణ హారియర్‌పై రూ.65 వేల వరకు తగ్గింపు ఉంది. ఆల్ట్రోజ్ , ఫ్లాగ్‌షిప్ సఫారి ఎస్‌యూవీ కొనుగోళ్లపై ఈ ఆఫర్లు వర్తించవు.

మరిన్ని వార్తలు