కొత్త టిగోర్ ఈవీని టీజ్ చేసిన టాటా మోటార్స్

17 Aug, 2021 15:18 IST|Sakshi

టాటా మోటార్స్ తన కొత్త టిగోర్ ఈవీని లాంచ్ చేయడానికి ఒక రోజు(ఆగస్టు 18) ముందు దానికి సంబందించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ లో పోస్ట్ చేసిన వీడియోలో కొండ పైకి ఎక్కుతున్న నెక్సన్ ఈవీ కారుతో పాటు మరో ఎలక్ట్రిక్ కారు వెళుతునట్లు చూపించారు. అందులో చూపించిన మరో కారు కొత్త టిగోర్ ఈవీ జిప్ట్రాన్. ఈ జిప్ట్రాన్ టెక్నాలజీ టాటా నెక్సన్ ఈవితో ప్రారంభం అయ్యింది. టాటా మోటార్స్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధికారులు, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టిగోర్ ఈవీ సెడాన్ ను ప్రవేశపెట్టింది.

జిప్ట్రాన్ టెక్నాలజీతో కొత్త టిగోర్ ఈవీ రికార్డు సృష్టించే అవకాశం ఉన్నట్లు ఆటోమేకర్ నమ్ముతోంది. జిప్ ట్రాన్ టెక్నాలజీ అధిక ఓల్టేజి 300+ ఓల్ట్ గల ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ప్రస్తుత టిగోర్ ఈవిలో ఉండే 72వీ ఎసీ ఇండక్షన్ టైప్ మోటార్ కంటే ఈ మోటార్ మరింత శక్తివంతమైనదని పేర్కొన్నారు. రాబోయే ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని భావిస్తున్నారు. జిప్ట్రాన్ ఈవీలు ఒకే ఛార్జ్ తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని టాటా మోటార్స్ గతంలో పేర్కొంది. డిజైన్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ కారు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బంపర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావచ్చు. రాబోయే టిగోర్ ఈవి వైవిధ్యమైన రంగులలో లభించవచ్చు. క్యాబిన్ లోపల కూడా అవుట్ గోయింగ్ ఫ్లీట్-స్పెక్ టిగోర్ ఈవితో పోలిస్తే ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు