మార్కెట్లోకి మరో టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్ కారు

19 Aug, 2021 14:58 IST|Sakshi

వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ టిగోర్‌ ఎలక్ట్‌ వెహికిల్‌ను(ఈవీ) భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రయాణికుల వాహనాల విభాగంలో కంపెనీ నుంచి నెక్సన్‌ ఈవీ తర్వాత ఇది రెండవ ఎలక్ట్రిక్‌ మోడల్‌ కావడం గమనార్హం. 55  కిలోవాట్‌ పవర్‌, 170 ఎన్‌ఎం టార్క్‌తో 26 కిలోవాట్‌ అవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు 60 కిలోమీ టర్ల వేగాన్ని 5.7 సెకన్లలో చేరుకుంటుంది. 

1,60,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ, మోటార్ వారంటీ ఉంది. జిప్‌ట్రాన్‌ టేక్నాలజీతో రూపుదిద్దుకుంది. డీలర్ల వద్ద రూ.21వేలు చెల్లించి కొత్త టిగోర్‌ను బుక్‌ చేసుకోవచ్చని టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్ట్‌ 31 నుంచి డెలివరీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 30కు పైగా కనెక్టెడ్‌ ఫీచర్లకు ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఎలక్టిక్‌ వాహన విభాగంలో దేశం నెక్సన్‌ ఈవీక్‌ 70 శాతం మార్కెట్‌ వాటా ఉంది.

మరిన్ని వార్తలు