వచ్చేసింది..గూగుల్‌ పే, ఫోన్‌ పే యాప్స్‌కు పోటీగా టాటా పే...! 

7 Apr, 2022 20:04 IST|Sakshi

అమెజాన్‌, జియో లాంటి సంస్థలకు పోటీగా టాటా గ్రూప్స్‌  గురువారం రోజున టాటా న్యూ యాప్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ ఎకానమీలో మరింత బలోపేతం అయ్యేందుకుగాను స్వంత యూపీఐ  ‘టాటా పే’ సర్వీసును టాటా న్యూలో  జోడించింది. 

టాటా పేతో చెల్లిస్తే రివార్డులు..!
టాటా పే యూపీఐ సేవలు  టాటా న్యూ యాప్‌లో అందుబాటులో ఉండనుంది. టాటా న్యూ యాప్‌తో జరిపే లావాదేవీలను టాటా పే ఉపయోగించి చెల్లించవచ్చును. ఈ చెల్లింపులతో యూజర్లకు న్యూకాయిన్స్‌(Neucoins)ను లభించనున్నాయి. టాటా న్యూ అందించే రిడెంప్షన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా టాటా పే ఉపయోగించి లేదా ఏదైనా టాటా గ్రూప్స్‌కు చెందిన స్టోర్లలో జరిపే కొనుగోళ్ల ద్వారా మాత్రమే న్యూకాయిన్స్‌ లభిస్తాయి. ప్రతి ఒక్క న్యూకాయిన్స్‌ విలువ రూ. 1 సమానం. కొత్త టాటా పే యూపీఐ ఖాతాను సృష్టించడానికి... ప్రతి ఒకరు మూడు-దశల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుసరించాలి. స్కానింగ్,  బ్యాలెన్స్ చెక్, ఖాతా/ స్వీయ-బదిలీ మొదలైన అన్ని సేవలను పొందవచ్చును.

భారత్‌లో యూపీఐ సేవలు గణనీయంగా పుంజుకున్నాయి. దేశ వ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఫిబ్రవరి, 2022లో రూ. 8.26 లక్షల కోట్లతో పోలిస్తే మార్చి 2022లో రూ. 9.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరలో యూపీఐ లావాదేవీలు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ. 81 లక్షల కోట్ల మార్కును దాటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.

చదవండి: 'టాటా న్యూ యాప్‌ లాంచ్‌, రతన్‌ టాటా మాస్టర్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

మరిన్ని వార్తలు