బీ అలర్ట్‌: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?

20 Apr, 2023 16:00 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే..అందులోనూ ఎండాకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయనే భయం  ఈ మధ్య కాలంలో కస్టమర్లను పట్టిపీడిస్తోంది.  ఈ క్రమంలో టాటా మోటార్స్‌ కు చెందిన పాపులర్‌ కారు,అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టా టా నెక్సాన్‌లో మంటలు చెలరేగడం ఆందోళన రేపింది. టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగుతున్న వీడియో వైరల్‌ కావడం ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో కలవరం రేపింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మంటల్లో కారు కాలి పోయింది. అయితే అధికారులు మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. దీనిపై టాటా  మోటార్స​ అధికారిక ప్రకటన విడుదల చేసింది.  

టాటా మోటార్స్ అధికారిక ప్రకటన
టాటా నెక్సాన్ ఈవీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదానికి కారణం అనధికార సర్వీస్ సెంటర్‌లో లెప్ట్‌ హెడ్‌ల్యాంప్‌ను సరిగ్గా మార్చకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని  స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సంబంధిత వర్క్‌షాప్‌లో ఫిట్‌మెంట్‌, రిపేర్‌లో లోపాలున్నాయని, హెడ్‌ల్యాంప్ ఏరియాలో విద్యుత్ లోపం కారణంగా థర్మల్ సంఘటనకు దారితీసిందని వివరించింది. బాధిత కస్టమర్‌కు అన్ని రకాలుగా  సాయం చేస్తున్నట్టు తెలిపింది.   (layoffs: షాకిచ్చిన ఇండియన్‌ ట్విటర్‌, 30 శాతం మందికి గుడ్‌ బై?)

ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం కొత్త టెక్నాలజీ, ఆధునిక ఎలక్ట్రానిక్ భాగాలతో అభివృద్ధి చెందుతోంది, ICE కార్లు, EVలలో శిక్షణ పొందిన నైపుణ్యం అవసరం. వినియోగదారుల భద్రత దృష్ట్యా, అటువంటి సంఘటనలు జరగకుండా అధీకృత టాటా మోటార్స్ వర్క్‌షాప్‌లలో మాత్రమే తమవాహనాలకు ఆన్-స్పెక్ కాంపోనెంట్స్, యాక్సెసరీస్, స్పేర్ పార్ట్‌లను అమర్చుకోవాలని కస్టమర్‌లను కోరుతున్నామని  విజ్ఞప్తి చేసింది. 

 ఇదే మొదటిసారి కాదు
2022 జూన్‌లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని రెస్టారెంట్ వెలుపల నిలిపి ఉంచిన టాటా నెక్సాన్  ఈవీలో  మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి.

మరిన్ని వార్తలు