Tata Nexon EV Facelift: లగ్జరీ కార్‌ ఫీచర్లతో టాటా నెక్సాన్‌ ఈవీ కొత్త వెర్షన్‌ 

15 Sep, 2023 18:56 IST|Sakshi

ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు 

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తాజాగా తమ నెక్సాన్‌ వాహనానికి సంబంధించి కొత్త వెర్షన్స్‌ ఆవిష్కరించింది. నెక్సాన్‌ ఈవీలో కొత్త వెర్షన్‌ ధర రూ. 14.74–19.94 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)గా ఉంటుంది. ఇది ఒకసారి చార్జి చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్ల రేంజి ఇస్తుంది. అలాగే, నెక్సాన్‌లో పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కొత్త వెర్షన్లను టాటా మోటర్స్‌ ప్రవేశపెట్టింది. (ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీష్‌ సంపాదన ఎంతో తెలిస్తే!)

వీటి రేటు రూ. 8.09 లక్షల (ఎక్స్‌–షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ (ప్యాసింజర్‌ వెహికల్స్‌ విభాగం) శైలేష్‌ చంద్ర తెలిపారు. ప్రస్తుతం టాటా మోటర్స్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్‌ప్రెస్‌–టీ ఈవీ ఉన్నాయి.    

మరిన్ని వార్తలు