టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు

19 Aug, 2021 17:27 IST|Sakshi

టాటా గ్రూప్ కు చెందిన టాటా స్టీల్ కంపెనీ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. టాటా స్టీల్ అన్నీ యూనిట్లలో 2020-2021 సంవత్సరానికి అర్హత కలిగిన ఉద్యోగులకు వార్షిక బోనస్ కింద ₹270.28 కోట్లను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థలలో ఒకటిగా టాటా స్టీల్ ప్రసిద్ది చెందింది. 2020-2021 వార్షిక బోనస్ చెల్లింపు కోసం టాటా స్టీల్, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య ఒక మెమోరాండం ఆఫ్ సెటిల్ మెంట్ పై సంతకాలు జరిగినట్లు ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!)

టివి నరేంద్రన్‌(సీఈఓ & ఎండి), అట్రేయి సన్యాల్, వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్ఎం), ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజ్ మెంట్ తరఫున సంతకం చేయగా టాటా వర్కర్స్ యూనియన్ తరుపున అధ్యక్షుడు సంజీవ్ కుమార్ చౌదరి, టాటా వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రెసిడెంట్ శైలేష్ కుమార్ సింగ్, టాటా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ సింగ్ ఇతర ఆఫీస్ బేరర్లు సంతకం చేశారు. అలాగే, స్టీల్ కంపెనీ & ఇండియన్ నేషనల్ మెటల్ వర్కర్స్ ఫెడరేషన్(ఐఎన్ ఎండబ్ల్యుఎఫ్), రాష్ట్రీయ కాలరీ మజ్దూర్ సంఘ్(ఆర్ సీఎంఎస్) మధ్య కూడా ఒక మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ పై సంతకాలు జరిగాయి. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో టాటా స్టీల్ సంస్థకు ప్రపంచ స్థాయి కర్మాగారం ఉంది. 2021 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారతదేశపు ప్రముఖ స్టీల్ మేకర్ ఏకీకృత నికర లాభం ₹9,768 కోట్లు. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌...!)

మరిన్ని వార్తలు