దటీజ్‌ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్‌!

22 Jun, 2022 15:14 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్‌ కార్పోరేట్‌ కంపెనీలు  తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ టాటాగ్రూపు ఇలా ఊరుకోలేదు. యుద్ధం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలను నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలు గుడ్‌బై చెప్పింది. 

రష్యాతో కట్‌
టాటా గ్రూపు ఆధ్వర్యంలో టాటా స్టీలు పరిశ్రమలు ఉన్నాయి. స్టీలు తయారీలో పల్వ్‌రైజ్డ్‌ బొగ్గును వినియోగిస్తారు. ఇంత కాలం ఈ బొగ్గును రష్యా నుంచి టాటా స్టీల్స్‌ దిగుమతి చేసుకునేది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిరసిస్తూ ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతి చేసుకోరాదని టాటాస్టీల్స్‌ నిర్ణయం తీసుకుంది.  ఇటీవల రష్యా నుంచి 75 వేల టన్నుల బొగ్గు రష్యా నుంచి టాటా స్టీల్‌కు సరఫరా అయ్యింది. దీంతో రష్యా యుద్ధం నేపథ్యంలో టాటా స్టీల్స్‌ గతంలో చేసిన ప్రకటన కేవలం ప్రచార ఆర్భాటం తప్పతే ఆచరణలో అమలు అయ్యేది కాదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన టాటా స్టీల్స్‌, రష్యా నుంచి బొగ్గు దిగుమతికి సంబంధించి వివరణ ఇచ్చింది. 

అది మా బాధ్యత
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఫిబ్రవరి 24న మొదలైందని, అయితే అప్పటికే బొగ్గు దిగుమతికి సంబంధించి రష్యాతో సంప్రదింపులు జరుగుతున్నాయని టాటా స్టీల్స్‌ చెప్పింది. వీటికి సంబంధించిన ఒప్పందాలు మార్చిలో తుది దశకు చేరుకున్నాయంది. ఒక బాధ్యత కలిగిన కార్పోరేట్‌ కంపెనీగా ఒప్పందాలను గౌరవించడం తమ బాధ్యతని టాటా తెలిపింది. అందుకే మార్చితో కుదిరిన అగ్రిమెంట్‌కి సంబంధించిన బొగ్గు మేలో దిగుమతి అయ్యిందని తెలిపింది.

ప్రత్యామ్నాయం 
యుద్దాన్ని ఖండిస్తూ బొగ్గు దిగుమతికి సంబంధించి ఏప్రిల్‌ నుంచి రష్యాతో ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని టాటా స్టీల్స్‌  చెప్పింది. రష్యా ప్రత్యామ్నాయంగా యూకే, నెదర్లాండ్స్‌ నుంచి బొగ్గు దిగుమతి చేసుకోబోతున్నట​‍్లు టాటా స్టీల్స్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దండయాత్రను నిరసిస్తూ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా అయితే రష్యాను ఏకాకి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. రష్యాతో ఉన్న పూర్వ సంబంధాల నేపథ్యంలో ఈ అంశంపై భారత ప్రభుత్వం ఆచీతూచీ వ్యవహరించింది. 

చదవండి: ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్‌..అందించిన టీఏఎస్‌ఎల్, ఎల్‌అండ్‌టీ!

మరిన్ని వార్తలు