ఐపీవోకు టాటా టెక్నాలజీస్‌ 

11 Mar, 2023 09:16 IST|Sakshi

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత  కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ నుంచి మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ అందించే టాటా టెక్నాలజీస్‌ ఐపీవో సన్నాహాలు ప్రారంభించింది. సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.

ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు ఇది అనుబంధ సంస్థకాగా.. ఇంతక్రితం ఐటీ సేవల నంబర్‌ వన్‌ కంపెనీ టీసీఎస్‌ 2004లో స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. ఐపీవోలో భాగంగా టాటా టెక్నాలజీస్‌ 9.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది.   

మరిన్ని వార్తలు