వచ్చేస్తోంది మరో టాటా ఎలక్ట్రిక్‌ కార్‌, విడుదల ఎప్పుడంటే!

10 Sep, 2022 10:33 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ నుంచి మరో ఈవీ ఎంట్రీ ఇస్తోంది. ఈ నెలాఖరులోగా టియాగో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రంగ ప్రవేశం చేయనుంది. 

ఇప్పటికే కంపెనీ నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ, ఎక్స్‌ప్రెస్‌–టి మోడళ్లను విక్రయిస్తోంది. నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ వ్యక్తిగత వాహన విభాగానికి, ఎక్స్‌ప్రెస్‌–టి క్యాబ్‌ సెగ్మెంట్‌ కోసం రూపొందించారు. వచ్చే అయిదేళ్లలో 10 రకాల ఎలక్ట్రిక్‌ మోడళ్లను ప్రవేశపెట్టాలన్నది కంపెనీ లక్ష్యం.  

మరిన్ని వార్తలు