టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్‌ అదిరింది.. రికార్డ్‌ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ!

11 Oct, 2022 17:01 IST|Sakshi

భారత ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌(EV) మార్కెట్‌ రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్రం ఆదేశాలు, ఇంధన లభ్యతతో పాటు వాటి ధరలు పెరుగదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కంపెనీలు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా టాటామోటార్స్‌ నుంచి టియాగో ఈవీ (Tiago EV)ని లాంచ్‌ చేసింది. ప్రారంభించిన తొలి రోజే 10వేలకు పైగా బుకింగ్స్‌ నమోదైనట్లు కంపెనీ తెలిపింది. దీంతో అత్యధిక ఈవీలను విక్రయిస్తోన్న కంపెనీగా రికార్డు సృష్టించింది.

టాటా మోటార్స్‌ నుంచి గ్రాండ్‌గా లాంచ్‌ అయిన ఈ వాహనం భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ కారుగా పెరు సంపాదించుకుంది. ఆల్-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.8.49 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాటా మోటార్స్ ప్రకటించిన ప్రారంభ ధర.. మొదట బుక్‌ చేసుకున్న 10వేల మందికి మాత్రమే అనే సంగతి తెలిసిందే. అయితే కస్టమర్ల వద్ద నుంచి భారీగా స్పందన రావడంతో షాకైన కంపెనీ, ఈ ఆఫర్‌ని మరో పదివేల మందికి పొడిగించింది.

అనగా మొదటగా బుక్‌ చేసుకున్న 20,000 మంది కంపెనీ ప్రకటించిన ప్రారంభ ధర వర్తించనుంది. వీటిత పాటు మొదటి 10,000 యూనిట్లలో 2,000 యూనిట్లను నెక్సన్‌ ఈవీ (Nexon EV), టిగోర్‌ ఈవీ(Tigor EV) యజమానులకు రిజర్వ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా టియాగో EVని కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా బ్రాండ్ వెబ్‌సైట్‌లో రూ.21,000 టోకెన్ ద్వారా ఈ ఈవీ కారుని బుక్ చేసుకోవచ్చు. ఈ కార్ల డెలివరీలు 2023 జనవరి నుంచి మొదలవుతాయి. టియాగో EV డెలివరీ తేదీ కస్టమర్ ఎంచుకున్న వేరియంట్, కలర్‌, సమయంపై ఆధారపడి ఉంటుంది.

టాటా మోటార్స్ టియాగో EVని రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్స్‌తో అందిస్తోంది. కస్టమర్లు 19.2 kWh బ్యాటరీ ప్యాక్ లేదా పెద్ద 24 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఎంచుకోవచ్చు.  ఒక్క ఛార్జ్‌తో 19.2kWh బ్యాటరీప్యాక్‌ 250 కి.మీల డ్రైవింగ్ రేంజ్‌ను, 24kWh బ్యాటరీప్యాక్‌ 315 కి.మీ. డ్రైవింగ్‌ రేంజ్‌ను అందిస్తాయి.

7.2kW AC ఫాస్ట్ ఛార్జర్ కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌లో 35 కిమీ డ్రైవింగ్‌ రేంజ్‌ను అందిస్తుంది. ఇది కార్‌ను కేవలం 3 గం 36 నిమిషాలలో పూర్తిగా ఛార్జ్ చేయగలదు. DC ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల్లో 110 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. దీని 10-80 శాతం ఛార్జింగ్ సమయం 57 నిమిషాలుగా ఉంది.

చదవండి: మూడేళ్ల సీక్రెట్‌ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ!

మరిన్ని వార్తలు