Electric Vehicles: మీరు ఉద్యోగస్తులా..! ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొంటే భారీగా ట్యాక్స్‌ బెన్‌ఫిట్స్‌

17 Nov, 2021 19:12 IST|Sakshi

ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సందడి చేస్తున్నాయి. పెట్రో ధరలు పెరిగిపోతుండడం, పెట్రో వాహనాల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలపై అప్‌గ్రేడ్‌ అవ్వడంతో ఈవీ వెహికల్స్‌ సత్తా చాటుతున్నాయి. ఇటీవల  జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్‌సైట్‌ నిర్వహించిన సర్వే సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఎలక్ట్రానిక్‌ స్కూటర్‌లు అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్‌ను సాధించగా, ఎలక్ట్రిక్‌ కార్లు 132.4 శాతం, ఎలక్ట్రానిక్‌ బైక్స్‌ 115.3 శాతం, ఎలక్ట్రానిక్‌ సైకిళ్లు 66.8 శాతం డిమాండ్ పెరిగినట్లు జస్ట్‌ డయల్‌ తన నివేదికలో పేర్కొంది. అయితే భారత్‌లో ఈవీ వెహికల్స్‌ కొనుగోలు చేస్తే ఆర్ధికంగా కాకుండా, ట్యాక్స్‌ పరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.  

ఈవీ వెహికల్స్‌తో ట్యాక్స్‌ బెన్‌పిట్స్‌ 
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఉపయోగం కోసం కొనుగోలు చేసిన కార్లు లగ్జరీ ఉత్పత్తులుగా పరిగణించబడతాయి. కాబట్టి  వినియోగదారులు కారు రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలను పొందలేరు. కానీ ఈవీ వెహికల్స్‌ విషయంలో అందుకు భిన్నంగా ఉంది. మనదేశంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఈవీ వెహికల్స్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా సెక్షన్ 80EEB ప్రకారం..ఉద్యోగస్తులు రుణంపై  ఈవీ కారును కొనుగోలు చేస్తే.. తీసుకున్న లోన్‌ పై చెల్లించే వడ్డీలో రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందవచ్చు. 

 

ఈవీ వెహికల్స్‌ రుణాలపై పన్ను మినహాయింపులు

సెక్షన్ 80EEB కింద  ఎలక్ట్రికల్‌ వెహికల్‌ లోన్‌ చెల్లించే సమయంలో రూ. 1,50,000 వరకు మొత్తం పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పన్ను మినహాయింపు ఫోర్‌ వీలర్‌, టూ వీలర్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. 
 
► సెక్షన్ 80EEB క్రింది షరతులకు లోబడి ఉంటుంది. ఈ మినహాయింపును ఎవరైనా ఒక్కసారి మాత్రమే పొందవచ్చు. అంటే ఇప్పటికే ఈవీ వెహికల్ ఉండి, మళ్లీ ఈవీ వెహికల్‌ను కొనుగోలు చేసే వారిని అనర్హులుగా భావిస్తారు. 
  
ఈ మినహాయింపు రుణంపై ఈవీని కొనుగోలు చేసే వ్యక్తులకు మాత్రమే. ఈవీకి రుణ ఫైనాన్సింగ్ ఆర్థిక సంస్థలు లేదా ఎన్‌ఎఫ్‌బీసీల నుండి పొందవచ్చు.  

ఈవీ పన్ను మినహాయింపు వ్యాపారాలకు కాదు. వ్యక్తులు మాత్రమే పొందగలరు.

► ఏప్రిల్ 1, 2019 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో తీసుకున్న అన్ని ఈవీ లోన్ చెల్లింపుల కోసం సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
సెక్షన్ 80EEB కింద పన్ను ప్రయోజనాలను ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2020-2021 నుండి పొందవచ్చు.

చదవండి : ఎలక్ట్రిక్‌ వాహనాలపై క్రేజ్‌ మరీ ఇంతగా ఉందా...!

>
మరిన్ని వార్తలు