IT Raids: టాప్‌ ప్రొడ్యూసర్ల కార్యాలయాలపై భారీ ఐటీ దాడుల కలకలం

2 Aug, 2022 13:30 IST|Sakshi

తమిళ సినీ పరిశ్రమ పెద్దలపై భారీ ఐటీ దాడులు

పన్ను ఎగవేత ఆరోపణలు, ప్రముఖ  నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు

సాక్షి, చెన్నై: తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలపై ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం సినీ వర్గాల్లో కలవరం రేపుతోంది.  కలైపులి సహా 10 మంది బిగ్‌ షాట్స్‌ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ  మంగళవారం ఈ దాడులు చేపట్టింది. అలాగే చెన్నైలోని టి.నగర్‌లోని కలైపులి థాను చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఈ తనిఖీలు నిర్వహిస్తోంది.

పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ రోజు సోదాలు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ  అధికారులు తెలిపారు.  అయితే ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని భావిస్తున్నారు. తమిళ నిర్మాత కలైపులి థాను, అన్బుచెజియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా, నలుగురు నిర్మాతల కార్యాలయాలపై ముమ్మర ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. చెన్నైలోని నుంగంబాక్కంలో అన్బుచెజియన్ ఇంటిపై ఉదయం 5 గంటల నుంచి దాడులు చేస్తోంది.

నిర్మాతలు అన్బుచెజియన్‌, ఎస్‌ఆర్‌ ప్రభు, త్యాగరాజన్‌, కలిపుల్లి ఎస్‌ .అన్బుచెజియన్‌కు చెందిన 40 చోట్ల ఆదాయపు పన్ను శాఖ ఈరోజు తనిఖీలు నిర్వహిస్తోంది. మదురైలో 30, చెన్నైలో 10 ప్రాంతాల్లో సోదారులు నిర్వహిస్తున్నారు.  వీరితోపాటు చాలామంది సినిమా ఫైనాన్షియర్లపై కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అన్బుచెజియన్ తమిళ చిత్రాలకు ఫైనాన్షియర్‌, ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను కార్యాలయంపై  ఐటీ దాడులు చేపట్టింది. మధురైకి చెందిన ఆయన గోపురం ఫిలింస్ ఆధ్వర్యంలో కొన్ని చిత్రాలను నిర్మించడంతోపాటు పలు  సినిమాలకు ఫైనాన్షియర్‌ కూడా వ్యవహరించారు.

కాగా తమిళ నిర్మాత అశోక్‌కుమార్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలుఎదుర్కొంటున్న అన్బుచెజియన్‌పై  ఐటీ దాడులు చేయడం ఇది మూడోసారి. అన్బుచెజియన్ నుంచి అప్పు తీసుకున్న నిర్మాతల ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు చేస్తోంది.
 

మరిన్ని వార్తలు