TCS: నవంబర్‌ 15లోపు ఆఫీసుకు రండి, ఉ‍ద్యోగులకు మెయిల్స్‌

14 Oct, 2021 19:57 IST|Sakshi

త్వరలో వర్క్‌ ఫ్రం హోంకి శుభం కార్డ్‌ పడనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ 2022 జనవరి కల్లా ఉద్యోగుల్ని ఆఫీస్‌కు రప్పించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే టీసీఎస్‌ ఉద్యోగులు ఆఫీస్‌లో వర్క్‌ చేసేందుకు మొగ్గుచూపుతున్నారంటూ వరుస ప్రకటనలు చేస్తుంది. అయితే తాజాగా ఆఫీసులకు రావాలని పిలుపునిచ్చింది. అదే సమయంలో ఉద్యోగ భద్రత, ఆరోగ్యాల్ని సైతం పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది.  

528,748 మంది ఉద్యోగులు 


దేశ, విదేశాల్లో మొత్తం 528,748 మంది టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. వారందరూ నవంబర్‌ 15లోపు  తిరిగి ఆఫీస్‌కు రావాలని గతవారం అఫీషియల్‌గా మెయిల్‌ పెట్టినట్లు ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. 5 శాతం మంది తమ సహచరులు (ఉన్నత ఉద్యోగులు) ఆఫీస్‌కు వస్తున్నట్లు చెప్పారు. హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ను మార్చడానికి ముందే.. ఇప్పటి నుంచే ఆఫీస్‌లకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ దశల వారీగా ఉంటుందని చెప్పిన ఆయన.. ఇందుకు సంబంధించి టీమ్ లీడర్లు- ప్రతి టీమ్ ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని' ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ తాము 25/25 మోడల్‌కి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కానీ ఆ మోడల్‌కు మారడానికి ముందే తాము ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలుస్తున్నట్లు చెప్పారు.  
ఇప్పటికే ప్రకటించారు


కొద్ది రోజుల క్రితం 2025 నుంచి హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీసీఎస్‌ సీఎఫ్‌ఓ ఎన్‌జీ సుబ్రమణియం తెలిపారు. ఇప్పటి నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించడం వల్ల హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ ఈజీ అవుతుందని టీసీఎస్‌ భావిస్తోంది. కాగా, 25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని.. దశలవారీగా మిగతా వాళ్లతో వర్క్‌ఫ్రమ్‌ హోం చేసే పద్దతిని హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ అంటారు.

చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నది ఈ సం‍స్థలోనే

మరిన్ని వార్తలు