TCS Work From Office: ‘మిలీనియల్స్‌’ భారీ షాక్‌, టెక్‌ దిగ్గజం టీసీఎస్‌కు కొత్త తలనొప్పులు!

19 Sep, 2022 19:06 IST|Sakshi

ప‍్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌కు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ఆఫీసుల్లో కార్య కలాపాలు కాగా.. తమ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయించుకునేదు క్లయింట్లు ఆఫీస్‌కు వస్తున్నారని, వారికి అనుగుణంగా తాము పనిచేయాల్సి ఉంటుందని ఆ సంస్థ చీఫ్‌ పరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌ గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ తరుణంలో ఆఫీస్‌కు రావాల్సిందేనని అల్టిమేట్టం జారీ చేయడం, అందుకు మిలీనియల్స్‌ నో చెబుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మరి ఇప్పుడు టీసీఎస్‌ యాజమాన్యం ఏం చేస్తుందా? అని ఇతర టెక్‌ సంస్థలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.   

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ వర్క్‌ ఫ్రమ్‌ చేస్తున్న మిలీనియల్స్‌ను ఆఫీస్‌కు రప్పించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా 2020 ప్రారంభంలో టీఎస్‌ఎస్‌ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించింది. ఇప్పుడు ఆ సౌకర‍్యానికి స్వస్తి చెప్పి ఆఫీస్‌కు రావాలని పిలుపునిచ్చింది. కానీ ఉద్యోగులు వచ్చేందుకే ససేమిరా అంటున్నారు. 

చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారని జాబ్‌కు రిజైన్‌ చేశాడు!

మిలీనియల్స్ అంటే?
1981-1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు. ప్రపంచదేశాలతో పోలిస్తే ఆ జనాభా మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉంది. మొత్తం దేశ జనాభాలో వీరి సంఖ్య 400 మిలియన్లు (40 కోట్లు) ఉంటుంది.

25/25 వర్క్‌ మోడల్‌
గతేడాది టీసీఎస్‌ 2025 నాటికి పూర్తి స్థాయిలో 25/25 అనే కొత్త వర్క్‌ కల్చర్‌ను అమలు చేస్తామని ప్రకటించింది. ఈ వర్క్‌ మోడల్‌ ప్రకారం..కొత్త హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ ప్రకారం..2025 నాటికి  25 శాతం ఉద్యోగులు ఏ సమయంలోనైనా ఆఫీస్‌ల నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది.25 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఆఫీస్‌లో పనిచేయాల్సిన అవసరం లేదు. అయితే కొత్త పని విధానాన్ని దశల వారీగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీసీఎస్‌.. ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఆఫీస్‌కు రమ్మంటోంది. ఈ నిర్ణయంపై టీసీఎస్‌ ఉద్యోగులు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. దీంతో సోషల్‌ మీడియాను అస్త్రంగా వినియోగించుకుంటుంది. 
 
సోషల్‌ మీడియాను 
ప్రస్తుతం, 20 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయం నుండి విధులు నిర్వహిస్తున్నారని ఎకనామిక్ టైమ్స్‌ నివేదిక తెలిపింది. మిగిలిన ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేలా టీసీఎస్‌ సోషల్‌ మీడియాను ఉపయోగిస్తుంది. ఉద్యోగులు క‍్లిస్ట పరిస్థితుల్ని, ఆనందంగా గడిపిన క్షణాల్ని గుర్తు చేస్తూ Nostalgia ఇమేజెస్‌ను వారితో  పంచుకుంటుంది. 

ఎందుకు వద్దంటున్నారు 
హైబ్రిడ్ వర్క్ ప్లాన్ ను వెంటనే అమలు చేయడానికి బదులుగా 2025కు వాయిదా వేయడం పట్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. టీసీఎస్ మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో 70 శాతం ఉన్న మిలీనియల్స్ వర్క్‌ చేస్తున్నారు. మహమ్మారి సమయంలో వారందరూ జర్నీతో పాటు ఇంటి ఖర్చుల్ని తగ్గించుకునేందుకు స‍్వస్థలాలకు వెళ్లారు. ఇప్పుడు వారిని రమ్మనమని అంటుంటే  తిరిగి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. 

కస్టమర్లే ముఖ్యం
కానీ వర్క్‌ విషయంలో ఉద్యోగులతో టీసీఎస్ వాదిస్తుంది. ఆఫీసుల్లో కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయించుకునేందకు కస్టమర్లు మా (టీసీఎస్‌) ఆఫీస్‌లకు వస్తున్నారు. వారిని గౌరవించాలి. అవసరాల్ని, నిబంధనల్ని పరిగణలోకి తీసుకోవాలని గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు. 

ఉద్యోగులతో జాగ్రత్త 
టీసీఎస్‌ 2021 లో దాదాపు లక్షమందిని నియమించుకుంది. వారిలో చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. మరికొంతమంది ఆఫీస్‌కు రాకుండానే ఉద్యోగాలకు రాజీనామా చేశారు.పని విషయంలో మునుపటి తరాలతో పోలిస్తే మిలీనియల్స్ మార్పును కోరుకుంటున్నారు. "టీసీఎస్‌ నాయకత్వం ఈ విషయంపై మిలీనియల్స్‌తో మరింత కమ్యూనికేట్ చేయాలి. ఐటి రంగంలో అట్రిషన్ రేటు ఎక్కువగా ఉంది. వారిని అర్ధం చేసుకోవడానికి కంపెనీలు ప్రయత్నాలు చేయాలి" అని పేరు చెప్పేందుకు ఇష్ట పడని టీసీఎస్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 

మూన్‌ లైంటింగ్‌ 
మహమ్మారి సమయంలో ఇంటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం పట్ల టీసీఎస్‌ వ్యతిరేకిస్తుంది. "మూన్‌ లైటింగ్ అనేది అనైతిక చర్య. ఇది ఉద్యోగి కాంట్రాక్ట్‌ , వ్యాపారాలు, కస్టమర్ల ఆసక్తులకు విరుద్ధం అని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

చదవండి👉 25 శాతం మంది చాలు, అంతకంటే ఎక్కువ వద్దు

మరిన్ని వార్తలు