సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్

17 Aug, 2021 16:33 IST|Sakshi

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు సృష్టించింది. నేడు(ఆగస్టు 17) ఇంట్రా-డే వాణిజ్యంలో టీసీఎస్ స్టాక్ కొత్త గరిష్టాన్ని తాకడంతో రూ.13 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) దాటిన రెండవ లిస్టెడ్ కంపెనీ, మొదటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేర్లు ఇంట్రా-డే ట్రేడ్ లో బిఎస్ఈలో 2.16 శాతం పెరిగి రూ.3,548 జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. ఎస్అండ్ పీ బిఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 11: 21 గంటలకు 55,632 పాయింట్ల వద్ద 0.09 శాతం పెరిగింది. టాటా గ్రూపు కంపెనీల్లో భాగమైన టీసీఎస్ ఇప్పటి వరకు ఆగస్టు నెలలో 12 ట్రేడింగ్ రోజుల్లో టీసీఎస్ స్టాక్ 11 శాతం ర్యాలీ చేసింది. (చదవండి: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్‌బుక్‌..!)

ప్రస్తుతం రూ.13.01 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ తో మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్ లో టీసీఎస్ రెండవ స్థానంలో ఉంది. రూ.13.80 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. బిఎఫ్ఎస్ఐ, కమ్యూనికేషన్, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, హైటెక్ వర్టికల్స్ లో ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ ఐటి సర్వీస్ ప్రొవైడర్లలో టీసీఎస్ ఒకటి. కరోనా మహమ్మారి వల్ల డిజిటల్ టెక్నాలజీకి విపరీతంగా డిమాండ్ ఏర్పడటంతో రెండు ఏళ్లుగా ఐటీ కంపెనీ స్టాక్ వృద్ధి కనబరుస్తుంది. ఐరోపాలో డిజిటల్ టెక్నాలజీ సంబంధించి భారీగా ప్రాజెక్టులు రావడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ టీసీఎస్ షేర్ ధర పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు