టీసీఎస్ మరో ఘనత

14 Sep, 2020 13:33 IST|Sakshi

మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ తరువాత  టీసీఎస్

సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత  టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్  మార్కెట్ క్యాప్ పరంగా అతివిలువైన రెండవ  కంపెనీగా నిలిచింది. సోమవారం టీసీఎస్ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో 2 శాతానికి పైగా లాభంతో 2442 వద్ద   టీసీఎస్  షేరు 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది.  దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను  రూ .9 లక్షల కోట్లను అధిగమించింది. దీంతో ఆర్ఐఎల్  తర్వాత ఈ ఘనతను సాధించిన  రెండవ సంస్థగా టీసీఎస్ రికార్డు సొంతం చేసుకుంది. (పెట్టుబడుల వెల్లువ : రిలయన్స్ జోరు)

ఐటీ  రంగంలో మెరుగైన  షేర్లలో టీసీఎస్ స్టాక్  ఒకటని నిపుణులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బీఎసీపీ పారిబాస్ నివేదిక ప్రకారం కరోనా కాలంలో  వర్క్ ఫ్రం  హోం  విధానం  ద్వారా ఎక్కువ  ప్రయోజనం పొందే అవకాశం ఉంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల  అద్దెలు, రవాణా లాంటి ఖర్చులను భారీగా తగ్గించుకుని  పొదుపు బాటపట్టనుందని అని కాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి గౌరవ్ గార్గ్ అన్నారు.

మరిన్ని వార్తలు