Work From Home End:వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌పై దిగ్గజ ఐటీ కంపెనీల కీలక నిర్ణయం...!

25 Oct, 2021 21:20 IST|Sakshi
IT Companies Work From Home Latest News

TCS Wipro Infosys HCL Tech Following These Plans To Call Employees Back: కోవిడ్‌-19 రాకతో ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గుతుండంతో  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌పై పలు దిగ్గజ ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడంతో, కరోనా  తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు క్రమంగా ఎండ్‌కార్ట్‌ పలకాలని చూస్తోన్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు  రప్పించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత్‌లోని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులను హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను ఫాలో అవ్వనున్నట్లు తెలుస్తోంది.దీంతో వర్క్‌ ఫ్రమ్‌ హోంకు ఎండ్‌కార్డ్‌ పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..!

ఈ ఏడాది చివరలో..! 
పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోసం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. భారత ఐటీ నెంబర్ వన్ కంపెనీ.. టీసీఎస్ తన కంపెనీ ఉద్యోగుల్లో సుమారు 70 శాతం మేర వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసనట్లు తెలుస్తోంది. కంపెనీలో సుమారు 95 శాతం మందికి కనీసం ఒక డోస్ పడింది.  ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు టీసీఎస్ ప్లాన్ చేస్తోంది. 2022 ఏడాది ప్రారంభంలోనైనా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని చూస్తోంది.  అయితే 2025 నాటికి తమ ఉద్యోగుల్లో 25 శాతం వర్క్ ఫ్రమ్ చేయవచ్చునని టీసీఎస్‌ పేర్కొనడం గమనార్హం.

హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌కు సై..!
ప్రముఖ ఐటీ ఇన్ఫోసిస్‌ హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌కు సై అంటోంది. కరోనా మహమ్మారి సమయంలో హైబ్రిడ్ వర్క్ మోడల్ పాపులర్ అయింది. వీటితో పాటు మారికో, విప్రో వంటి ఐటీ కంపెనీలు కూడా హైబ్రిడ్ వర్క్ మోడల్ దిశగా సాగుతున్నాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో 86 శాతం మంది కనీసం ఒక డోస్ వేసుకున్నారు.  18 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ అనంతరం వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులు వారానికి రెండుసార్లు కార్యాలయానికి వస్తోన్నట్లు  విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీలో సీనియర్ ఉద్యోగులు వారానికి రెండు రోజులు కార్యాలయాలకు వస్తున్నారు. ఈ ఏడాదిలోపు గరిష్ట సంఖ్యలో ఉద్యోగులను పిలిచే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ వీవీ అప్పారావు అభిప్రాయపడ్డారు. 
చదవండి: చైనాపై విమర్శ..! జాక్‌ మా కొంపముంచింది..!

మరిన్ని వార్తలు