TCS: టీసీఎస్ సంచలనం.. ప్రపంచంలోనే 2వ స్థానంలో..!

27 Jan, 2022 09:06 IST|Sakshi

TCS, Infosys among world’s most valuable brands: దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్ అత్యంత విలువైన బలమైన ఐటీ సేవల అందిస్తున్న బ్రాండ్‌గా కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ గత సంవత్సరం నుంచి 52 శాతం వృద్ధి చెందింది. $12.8 బిలియన్లతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి సేవల బ్రాండ్‌గా అవతరించింది. 

16.8 బిలియన్ డాలర్ల విలువైన టీసీఎస్ వ్యాపార పనితీరు, మెరుగైన భాగస్వామ్యాల ఒప్పందాల ద్వారా రెండు ర్యాంకింగ్ స్థాయికి చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ బ్రాండ్ విలువ గత 12 నెలల్లో $1.844 బిలియన్(12.5 శాతం) పెరిగి $16.786 బిలియన్లకు చేరుకుంది. ఈ వృద్ధికి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడుదారులు, ఉద్యోగులు, కస్టమర్ ఈక్విటీ & బలమైన ఆర్థిక పనితీరు కారణమని పేర్కొంది. బ్రాండ్ విలువ వృద్ధి పరంగా భారతీయ ఐటీ సేవల కంపెనీలు, యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తున్న పోటీని అధిగమించాయి. కోవిడ్-19 మహమ్మారి ద్వారా డిజిటల్ సేవలు అందించే కంపెనీలు భారీగా వృద్ది చెందాయని ఈ కొత్త నివేదిక తెలిపింది. 

2020 నుంచి భారతీయ బ్రాండ్ల సగటు వృద్ధి 51 శాతం పెరిగితే, యుఎస్ బ్రాండ్ల వృద్ది సగటున 7 శాతం తగ్గింది. కరోనా మహమ్మారి వల అనేక రంగాలు ప్రభావితం అయినప్పటికీ ఐటి సేవలు & సాంకేతిక రంగానికి చెందిన దూసుకెళ్తున్నాయి. మార్కెట్ కి అనుగుణంగా ద్వారా క్లౌడ్ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి సేవలు అందిస్తుండటం ద్వారా కంపెనీలు దేశీయ కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. 

(చదవండి: సామాన్యులకు దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..!)

మరిన్ని వార్తలు