వేలాది ఉద్యోగాల కోత మాత్రమేనా..అమెజాన్‌ మరో సంచలన నిర్ణయం

14 Dec, 2022 15:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక మాంద్యం హెచ్చరికల మధ్య టెక్ దిగ్గజం అమెజాన్ మరో కీలకనిర్ణయం తీసుకుంది. పదివేలకుపైగా ఉద్యోగులకు ఉద్వాసన పలకడమేకాదు.. కొత్త నియామకాలను కూడా ఆలస్యం చేస్తోంది.  వచ్చే  ఏడాది ఆరంభంలో జాయిన్‌ కావాల్సిన యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల  జాయింనింగ్స్‌ కూడా వాయిదా వేసుకుంది.

(చదవండి: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌: ‘సీక్రెట్’ ఫీచర్‌ ఒక్కసారే!)

తాజా నివేదికల ప్రకారం అమెజాన్‌లో కొత్త నియామకాలు 2023, మే నాటికి ప్రారంభం కావాల్సిఉంది. కానీ ప్రస్తుత  గ్లోబల్‌ మాంద్యం పరిస్థితుల కారణంగా ఈ నియామకాలను 2023 చివరి వరకు పొడిగిస్తోందని తెలుస్తోంది. ఈమేరకు వారికి ఇంటర్నల్ మెయిల్‌లో సమాచారం అందించిందట. ఆర్థిక సవాళ్ల దృష్ట్యా, నియామకాలలో కొందరికి ప్రారంభ తేదీలను ఆరు నెలల వరకు ఆలస్యం చేస్తున్నామనీ,  అలాగే  ఆలస్యం కారణంగా ప్రభావితమైన కొత్త ఉద్యోగులకు  పరిహారం చెల్లిస్తామని కూడా అమెజాన్‌ తెలిపింది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ నిబంధనలకు కట్టుబడి ఉన్నామంటూ వారికి ఈ మెయిల్‌ సందేశాన్ని పంపింది.  అంతేకాదు కంపెనీలో జాయిన్‌ అయ్యారా  లేదా అనేదానితో సంబంధం లేకుండా 13వేల డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఒకేసారి చెల్లింపును అందుకుంటారని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్‌ చేసింది.

(ఇది కూడా చదవండి: నథింగ్ స్మార్ట్‌ఫోన్‌ (1)పై బంపర్‌ ఆఫర్‌: ఏకంగా 22 వేల తగ్గింపు )

కాగా వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్షలో భాగంగా, సర్దుబాట్లలో భాగంగా అమెజాన్‌ ఉద్యోగుల తొలగింపులకు నిర్ణయించింది. రిటైల్ , మానవ వనరుల విభాగాలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత  తాజా పరిణామం సంచలనంగా మారింది. మరోవైపు ఉద్యోగుల కోతను సమర్ధించుకున్న అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ 2023లో  మరిన్ని తొలగింపులు ఉంటాయనే సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు