డిజిటల్‌ లోన్‌ మార్కెట్‌లోకి గూగుల్‌, ఫేస్‌బుక్‌, షావోమీ! ఒక ట్రిలియన్‌ డాలర్లతో..

31 Aug, 2021 17:10 IST|Sakshi

India Digital Loan Market: కరోనా టైం నుంచి దేశంలో ఆన్‌లైన్‌​ ట్రాన్‌జాక్షన్స్‌ విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇండియా డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌పై టెక్‌ కంపెనీలు ఫోకస్‌ చేస్తున్నాయి. సుమారు ఒక ట్రిలియన్‌ డాలర్లతో డిజిటల్‌ లోన్‌ మార్కెట్‌ను విస్తరించాలని ప్రణాళిక వేసుకుంటున్నాయి. 


ఫేస్‌బుక్‌, షావోమీ, అమెజాన్‌, గూగుల్‌.. టెక​ దిగ్గజాలు ఇప్పుడు భారత దేశంలోని డిజిటల్‌ లోన్‌ మార్కెట్‌ మీద కన్నేశాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. షావోమి ఇండియా హెడ్‌​ మనూ జైన్‌ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. లోన్లు, క్రెడిట్‌ కార్డులు, ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులు ఇందుకోసం దేశంలోని రుణదాతల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారాయన.

ఇది వరకే చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఫేస్‌బుక్‌ ముందుకు వచ్చింది. స్టార్టప్‌లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్‌ బిజినెస్‌ లోన్‌ పేరుతో గతేడాది 100 మిలియన్‌ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్‌బుక్‌ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే ప్రక్రియలో తలమునకలైంది.

గూగుల్‌ కూడా చిన్నస్థాయి రుణదాతలతో ఒప్పందాలు ఇదివరకే చేసుకుంది. గూగుల్‌ పే ద్వారా డిజిటల్‌ గోల్డ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వాహణను ప్రారంభించింది. మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఆన్‌లైన్‌ రుణదాతల్ని రెగ్యులేట్‌ చేయాలనే ఆలోచనలో ఉంది.

చదవండి: డిపాజిటర్లకు మరింత రక్షణ

మరిన్ని వార్తలు