Surbhi Gupta : మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?,..‘ఇవన్నీ భారతీయుల్ని ఏం చేయలేవు’!

5 Dec, 2022 16:56 IST|Sakshi

అమెరికాతో పాటు అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. అమెరికా టెక్‌ సంస్థలు ఉద్యోగులతో పాటు వలసేతర హెచ్‌1బి వీసా హోల్డర్లని విధుల నుంచి తొలగిస్తున్నాయి. వారిలో మెటాలో ప్రొడక్ట్‌ మేనేజర్‌ పనిచేస్తున్న సురభిగుప్తా ఒకరు. తాజాగా మెటాలో ఉద్యోగం కోల్పోవడంపై జర్నలిస్ట్ సవితా పటేల్‌తో మాట్లాడారు. మెటాలో ఉద్యోగం, లేఫ్స్‌పై హెచ్‌ 1 బీ వీసాపై ఆమె మనోగతం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. 

ఆ రోజు మా అమ్మ పుట్టిన రోజు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మెటా ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించింది. లేఆఫ్స్‌పై నాతో పాటు నా సహచర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటల (స్థానిక కాలమానం) మెటా నుంచి మెయిల్‌. ఉద్యోగం నుంచి నన్ను తొలగించారని. ఈ ఏడాది ప్రారంభంలో మెటాలో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరాను. నా విధుల్ని నేను చక్కగా నిర్వర్తిస్తా. నా ఉద్యోగం పోయిందని తెలిసి నా టీమ్‌ సభ్యులు షాక్‌గురయ్యారు.  

ఉద్యోగం కోల్పోయారు కదా మీకెలా అనిపించింది
నా స్కూల్‌ డేస్‌లో ఓ టీచర్‌ ఎప్పుడూ ఒక మాట చెప్పే వారు. వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌. అదే మోటోతో పనిచేస్తున్నాను. కానీ నా ఉద్యోగం పోయిందని తెలిసి టైటానిక్‌ షిప్‌లా మునిపోతున్నట్లు అనిపించింది. మెయిల్, ఆ తర్వాత ల్యాప్‌టాప్ యాక్సెస్ కోల్పోయాను. అందుకు విరుద్ధంగా లింక్డ్‌ ఇన్‌లో చాలా మంది సహోద్యోగులు, మాజీ సహోద్యోగులు, స్నేహితులు ఇలా చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు. నాకు అప్పుడే అనిపించింది నా అనేవాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారని.  

మార్చి వరకే డెడ్‌లైన్‌
ఇక మెటాలో నా లాస్ట్‌ వర్క్‌ డే జనవరి వరకు ఉంది. నాకు హెచ్‌1 -బీ వీసా (అమెజరికాలోని సంస్థలు ఆరు సంవత్సరాల వరకు విదేశీయులను నియమించుకోవడానికి అనుమతించే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా) తో మరో 60 రోజులు యూఎస్‌లో ఉండొచ్చు. కాబట్టి మార్చి ప్రారంభం వరకు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు సమయం ఉంది.  

ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే
డిసెంబరులో సెలవుల కారణంగా ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే. కానీ మరో ఉద్యోగంలో చేరే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాను. అనుకున్నది సాధిస్తా. 

‘ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా’
జీవితంతో ఎప్పుడు రాజీ పడకూడదు. అనుకున్నది సాధించేలా సంక్షోభంలోనూ అవకాశాల్ని ఎలా చేజిక్కించుకోవాలి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. అంతేకాదు ఇప్పుడు మనం ఒకటి కోల్పోయామంటే భవిష్యత్‌లో ('ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా') ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేవారు. మెటా నన్ను ఫైర్‌ చేసిన తర్వాత మరో జాబ్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించా. 

హెచ్‌1-బీ వీసాపై ఆధారపడి ఉంది
కానీ అమెరికాలో పని చేయడం, ఇక్కడ ఉండే హక్కు నా హెచ్‌1-బీ వీసాపై ఆధారపడి ఉంటుంది. నేను 2009లో యుఎస్‌కి వచ్చా. ఎవరి ప్రోత్సాహాం లేకుండా స్వశక్తి, తెలివి తేటలతో నా కెరియర్‌ను నిలబెట్టుకున్నాను. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాను. టెస్లా, ఇన్‌ట్యూట్‌ (Intuit) వంటి కంపెనీల్లో పనిచేశా. మంచి మంచి ప్రొడక్ట్‌లను తయారు చేశా. టాప్‌ రేటింగ్‌లో పనిచేశా. పన్నులు చెల్లించా. ఇక్కడి (యూఎస్‌) ఆర్థిక వ్యవస్థకు 15 సంవత్సరాలకు పైగా సహకరించాను. ఇక్కడే పర్మినెంట్‌ నివసించే హక్కు పొందాను. నేను మిస్ భారత్ కాలిఫోర్నియా అందాల పోటీల్లో నా ఆరాధ్య, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ చేతుల మీదిగా కిరీటం పొందాను. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచాను. 

టెక్ కంపెనీల ఉద్యోగాల తొలగింపుపై 
అమెరికా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు భారతీయుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయినా సరే మెటా, అమెజాన్, ట్విట్టర్ లే ఆఫ్‌లు భారతీయులు అమెరికాకు రావాలని, ఇక్కడే స్థిరపడాలన్న కలల్ని నాశనం చేయవు’ అంటూ సురభిగుప్తా తన మనోగతాన్ని వివరించారు.

చదవండి👉 ప్చ్‌, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది!

మరిన్ని వార్తలు