‘మూన్‌లైటింగ్‌’ దుమారం : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్‌

15 Nov, 2022 19:26 IST|Sakshi

ఒకే సారి రెండేసి ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిపై ఆయా టెక్‌ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు పనిచేస్తున్నారంటూ టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌లు ఉద్యోగుల్ని ఫైర్‌ చేశాయి. కానీ టెక్‌ మహీంద్రా మాత్రం అందుకు విభిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగులకు మూన్‌లైటింగ్‌ పాల్పడటాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా మూన్‌లైటింగ్‌పై మరో కీలక ప్రకటన చేసింది. 

నవంబర్‌ నెలలో ఉద్యోగుల కోసం తన మూన్‌లైటింగ్‌ పాలసీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ తెలిపారు. పలు నివేదికల ప్రకారం.. వర్క్‌కు ఆటంకం కలగనంత వరకు గిగ్‌ వర్క్స్‌కు అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారాంతంలో లేదా వారంలో రెండు గంటలు వంటి స్వల్ప కాలానికి మాత్రమే పనిచేసేందుకు అంగీకరించనున్నట్లు సమాచారం.  

చదవండి👉  ‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్‌’

టెక్ మహీంద్రా మూన్ లైటింగ్ పాలసీలో ఆఫీస్‌కు వర్క్‌తో ఎలాంటి పోటీ ఉండకూడదు. మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ లేదా కస్టమర్ కాంట్రాక్ట్ కు కట్టుబడి ఉండాలి. కంపెనీ నుంచి రాతపూర్వక అనుమతి అవసరం’ వంటి సంస్థ నిర్ధిష్ట సూత్రాలను కలిగి ఉంటుందని ఈ సందర్భంగా సోయిన్‌ పేర్కొన్నారు.  

అట్రిషన్‌ రేటు తగ్గుతుంది
ఈ ఏడాది ఆగస్టులో స్విగ్గీ తన ఉద్యోగులను పని గంటల తర్వాత గిగ్‌ వర్క్స్‌ చేసుకోవచ్చంటూ మూన్‌లైటింగ్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫోసిస్ సైతం అంతకు ముందు మూన్‌లైటింగ్‌ చేసే ఉద్యోగులకు వార్నింగ్‌ ఇచ్చింది. కానీ అది కాస్త వివాదం కావడంతో గిగ్‌ ఉద్యోగాలు చేసేందుకు అనుమతించింది. అయితే టెక్‌ సంస్థలు తీసుకునే ఈ నిర్ణయం వల్ల అట్రిషన్ రేటు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే శాలరీల కోసం వేరే సంస్థలోకి వెళ్లే ఆలోచనల్ని విరమిస్తారని భావిస్తున్నారు.

చదవండి👉  కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు!

మరిన్ని వార్తలు