Moonlighting టెక్‌ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒ‍క్క మాటతో..!

2 Nov, 2022 11:51 IST|Sakshi

సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూన్‌లైటింగ్‌పై దేశీయ 5వ అతిపెద్ద టెక్‌ దిగ్గజం టెక్‌ మహీంద్ర కీలక వ్యాఖ్యలు చేసింది. మూన్‌లైటింగ్‌కు ఆదిగా మద్దతిచ్చిన కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానీ స్పందిస్తూ తమది డిజిటల్ కంపెనీ తప్ప, వారసత్వ సంస్థ కాదని వ్యాఖ్యానించారు.  తమ కంపెనీ సైడ్‌ గిగ్‌లకు మద్దతునిస్తుందని, అసలు అదే ఫ్యూచర్‌ అంటూ మంగళవారం కంపెనీ ఫలితాల సందర్భంగా   ప్రకటించడం విశేషం.

అయితే మహీంద్రా గ్రూప్ కంపెనీ ఈ అంశంపై ఇంకా ఒక విధానాన్ని తీసుకురాలేదన్నారు. ఎందుకంటే 90కి పైగా దేశాల్లో స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని గుర్నాని మీడియాతో అన్నారు. తన ఉద్యోగులకు మూన్‌లైట్‌ను అనుమతించే విధానంపై పనిచేస్తున్నామన్నారు. లెగసీ, డిజిటల్ కంపెనీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, తమది లెగసీ సంస్థ కాదు కాబట్టి మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడంలో విశ్వాసం వస్తుందన్నారు. అయితే సిబ్బంది ముందుకు వచ్చి వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని వెల్లడించాలని కంపెనీ భావిస్తోందని, విలువలు, నైతికత, పారదర్శకత వంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని  పేర్కొన్నారు. 

ఎవరైనా మంచి పనితనం కలిగి ఉంటే సీఈవోగా  చాలా సంతోషిస్తాను.. కానీ  ఉద్యోగులు అనుమతి తీసుకుని,  ఏ  పని చేస్తున్నారో తమకు క్లియర్‌గా చెబితే బావుంటుందనే  మాట మాత్రం కచ్చితంగా  చెబుతానన్నారు. ఇది కంపెనీతోపాటు, ఆ ఉద్యోగికి కూడా శ్రేయస్కరమన్నారు. అయితే ప్రస్తుతం తమ వద్ద ఉన్న 1.63 లక్షల ఉద్యోగుల్లో ఎవరికైనా అనుమతి లేకుండా రెండు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించే విధానం ఏదీ లేదని స్పష్టం చేసిన ఆయన, ఏదైనా ఉల్లంఘన జరిగితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు సెప్టెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ  లాభాలు  శాతం క్షీణించాయి.సెప్టెంబర్‌తో ముగిసిన  రెండవ త్రైమాసికంలో పన్ను తర్వాత కన్సాలిడేటెడ్ లాభం (గత ఏడాది నాటి 1,338.7 కోట్లతో పోలిస్తే)  1,285.4 కోట్లకు పడిపోయింది. (Elon Musk క్లారిటీ: బ్లూటిక్‌ వెరిఫికేషన్‌  ఫీజు ఎంతో తెలుసా?)

కాగా కోవిడ్‌ పరిస్థితులు, ఆంక్షలు, వర్క్‌ ఫ్రంహోం సమయంలో  ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్‌ అంశం వివాదాన్ని రేపింది. విప్రో, టీసీఎస్‌, ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థల్లో చర్చకు దారి తీసింది. మూన్ లైటింగ్‌ను ఇన్ఫోసిస్  కూడా వ్య‌తిరేకించింది. మూన్‌లైటింగ్‌కు పాల్ప‌డితే చర్యలు తప్పవంటూ ఈమెయిల్‌ ద్వారా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముఖ్యంగా విప్రో ఇదే ఆరోపణలతో 300మంది ఉద్యోగులను తొలగించడంతో ఇది మరింత ముదిరింది. ఫలితంగా 220 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ నైతిక‌త, చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై భిన్నాభిప్రాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు