టెక్నో కామన్ 16 : సూపర్ ఫీచర్లు, బడ్జెట్ ధర

10 Oct, 2020 15:16 IST|Sakshi

అద్భుతమైన ఫీచర్లతో టెక్నో కామన్ 16 

సాక్షి, న్యూఢిల్లీ : టెక్నో కామన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఆవిష్కరించింది. బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ ప్లే, ఏఐ లెన్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా,18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌  లాంటి అద్భుతమైన ఫీచర్లతో  టెక్నో కామన్ 16 ను లాంచ్ చేసింది. అంతేకాదు  అందుబాటులో ధరలో తీసుకొచ్చింది.  34 గంటల కాలింగ్ సమయం, 16 గంటల వెబ్ బ్రౌజింగ్, 22 గంటల వీడియో ప్లేబ్యాక్, 15 గంటల గేమ్ ప్లే 180 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్  సమాయాన్ని తమ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ అందిస్తుందని  సుమారు రెండు గంటల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని టెక్నో పేర్కొంది.


ధర, లభ్యత
టెక్నో కామన్ 16 ధరను 10,999 రూపాయలుగా నిర్ణయించింది. అక్టోబర్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా టెక్నో కామన్ 16 అందుబాటులో ఉంటుంది.  క్లౌడ్ వైట్,  ప్యూరిస్ట్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభ్యం.

టెక్నో కామన్ 16 ఫీచర్లు
6.80 అంగుళాల  ఫుల్ హెచ్ డీ హోల్ పంచ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10
మీడియాటెక్ హెలియో జి 79 సాక్ 
4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
64+2+2+2 మెగాపిక్సెల్ రియర్ క్వాడ్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా