తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు పైగా డిస్కౌంట్స్‌ కూడా

18 Jul, 2021 10:53 IST|Sakshi

భారత్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఇండ‌స్ట్రీపై హాంగ్‌ కాంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు కన‍్నేశాయి.మార్కెట్‌ లో పోటీని తట్టుకునేలా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లతో  హాంకాంగ్‌కు చెందిన 'టెక్నో' సంస్థ భారత్‌ లో రెండు స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేసింది.టెక్నో కేమన్‌ 17, టెక్నో కేమన్‌ 17 ప్రో స్మార్ట్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ జులై 26 నుంచి భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నట్లు టెక్నో ప్రతినిథులు తెలిపారు.  

టెక్నో కేమన్‌ 17 ఫీచర్స్‌ 


6.8 అంగుళాల ఫుల్​హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ హెలియో జీ805 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ తో పాటు 256 ఎక్స్‌టెండెబుల్‌ మెమొరీని అందిచనుంది. 64 మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 16 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సౌలభ్యంతో అందుబాటులోకి రానుండగా దీని  ప్రారంభ ధర రూ. 12,999గా ఉంది  

టెక్నో కేమన్‌ 17 ప్రో


 6.8 ఇంచెస్‌ ఫుల్​ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో G95 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుండగా, 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 48 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 16,999 ఉండగా..రూ. 1,999 డిస్కౌంట్ లభిస్తుంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు