టెక్నో ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ‘ఫాంటమ్ వీ ఫోల్డ్’ లాంచ్‌, తక్కువ ధరలో

1 Mar, 2023 17:12 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ తన తొలి ఫోల్డబుల్‌  ఫోన్‌ను టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ బార్సిలోనా  మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఆవిష్కరించింది.ఫ్లాగ్‌షిప్ 4nm MediaTek డైమెన్సిటీ 9000+ SoC స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో ముందుగా లాంచ్‌ కానుందని ప్రకటించింది. టెక్నో MWC 2023లో అలాగే టెక్నో  స్పార్క్ 10 ప్రో, మెగాబుక్ ఎస్‌1 2023ని ఆవిష్కరించింది. అలాగే ధరను కూడా ధృవీకరించింది. 15 నిమిషాల్లో 40 శాతానికి రీఛార్జ్, 55 నిమిషాల్లో పూర్తి ఛార్జ్‌ అవుతుందని, శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌4 కంటే స్క్రీన్ కంటే పెద్దగా  ఉందని వెల్లడించింది.  అల్ట్రా-క్లియర్ 5-లెన్స్ కెమెరాలతో, ప్రపంచంలోనే మొదటి  లెఫ్ట్‌-రైట్‌  ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అని పేర్కొన్నారు

ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లభ్యం కానుంది.  12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ వేరియంట్‌ ధరలు రూ.89,999(ఆఫర్‌ ధర) వరుసగా  రూ. 99,999. నలుపు, తెలుపు అనే రెండు కలర్ వేరియంట్‌లలో అందిస్తోంది. ముందుగా తీసుకున్నవారికి 10 వేల డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది. క్యూ2లో సేల్స్‌ మొదలు పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. 

టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్    స్పెసిఫికేషన్స్
6.42-అంగుళాల LTPO AMOLED కవర్ డిస్‌ప్లే
1080x2550 రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌
7.85-అంగుళాల (2000x2296) ప్రధాన డిస్‌ప్లే
1080x2550 రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌
50+50+13 ఎంపీ రియర్‌  ట్రిపుల్‌ కెమెరా
 32+ 16 మెగాపిక్సెల్ రెండు సెల్ఫీ కెమెరాలు 

మరిన్ని వార్తలు