Tourette Syndrome: యువతీ యువకుల్లో పెరిగిపోతున్న 'టూరెట్‌ సిండ్రోమ్‌'.

17 Oct, 2021 14:30 IST|Sakshi

టిక్ టాక్‌ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్‌ వర్కింగ్‌ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ ఆకర్షణే భారత్‌ మినహా మిగిలిన దేశాలకు చెందిన పిల్లల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ కారణంగా టిక్‌ టాక్‌ వినియోగంతో అనారోగ్యానికి గురై పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. 

భారత కేంద్ర ప్రభుత్వం టిక్‌ టాక్‌పై నిషేదం విధించింది. కానీ మిగిలిన దేశాల్లో ఆ యాప్‌ వినియోగంలో ఉండడం, ఆ యాప్‌ను ఉపయోగించి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. టిక్‌ టాక్‌ వినియోగిస్తున్న వారిలో 'టూరెట్‌ సిండ్రోమ్‌' అనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తేలింది. ముఖ్యంగా పిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం, చిత్ర విచిత్రంగా కన్ను కొట్టడం, ఎక్స్‌ ప్రెషన్స్‌, సౌండ్స్‌ చేయడం లాంటి రుగ్మతలు ఎక్కువయ్యాయి. ఇటీవల జర్మనీకి చెందిన పలు ఆస్పత్రులకు ఈ తరహా సమస్యలతో బాధపడే యువతీ యువకులు ట్రీట్మెంట్‌ కోసం వస్తున్నారని వాల్‌స్ట్రీట్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ పలు మెడికల్‌ రిపోర్ట్‌ల ప్రకారం..లాక్‌ డౌన్‌కు ముందు టిక్‌ టాక్‌ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్‌ కోసం నెలకు ఒకరు లేదా ఇద్దరు వచ‍్చే వాళ్లు. కానీ ఇప్పుడు వారి సంఖ్య 10 మంది నుంచి 20 మందికి పెరిగినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తన  కథనంలో పేర్కొంది. 


టూరెట్‌ సిండ్రోమ్‌కు ట్రీట్మెంట్‌ చేయడంలో 25 ఏళ్ల అనుభవం ఉన్న జర్మనీలోని హనోవర్‌కు చెందిన డాక్టర్‌ కిర్‌స్టెన్‌ ముల్లర్ మాట్లాడుతూ..''టీనేజర్స్‌,యువతీ యువకులు ఎక్కువ మంది టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. వారిలో టూరెట్‌ సిండ్రోమ్‌ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు ఎక్కువైనట్లు తెలిపారు. ఈ రుగ్మత ఎక్కువగా అబ్బాయిల్ని ప్రభావితం చేస్తుంది. అనారోగ్య సమస్యలు యవ్వనంలో ఉన్నప్పుడు మొదలవుతాయి. తరువాత కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయని"అన్నారు.అయితే మరికొంత మంది డాక్టర్లు టీనేజర్స్‌ ఎదురవుతున్న సమస్య టూరెట్‌ సిండ్రోమ్‌ కాదని అంటున్నారు. ఫంక్షనల్ మూవ్‌మెంట్ డిజార్డర్ అని చెబుతున్నారు.


అదిగమించడం ఎలా 
టిక్‌ టాక్‌ వల్ల ఎదురయ్యే సమస్యలకు ట్రీట్మెంట్‌ చేయవచ్చని తెలుస్తోంది. పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ వారు వీడియోలు చేస్తుంటే ఏ తరహా వీడియోలు చూస్తున్నారో తల్లిదండ్రులు గుర్తించాలని అంటున్నారు. ప్రతిరోజు అదే పనిగా టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుంటే తల్లిదండ్రులు వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

చదవండి: Apple Fired Janneke Parrish: లీకుల పేరుతో ఉద్యోగులపై ఆపిల్‌ వేటు

మరిన్ని వార్తలు