తెలంగాణతో జట్టు కట్టిన మాస్టర్‌ కార్డ్స్‌

26 May, 2022 15:48 IST|Sakshi

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్‌ కార్డ్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మాస్టర్‌ కార్డ్స్‌  ప్రెసిడెంట్‌ మైఖేల్‌ ఫ్రోమాన్‌తో మంత్రి కేటీఆర్‌ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజటల్‌ స్టేట్‌ పార్టనర్‌షిప్‌ విషయంలో ఇరువురి మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింది. 

రాష్ట్ర ప్రజలకు అత్యంగ వేగంగా డిజిటల్‌ సేవలు అందివ్వడానికి మాస్టర్‌ కార్డ్స్‌ తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం దోహదం చేస్తుంది.  అంతే కాకుండా రైతులు, మధ్య, చిన్నతరహా వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వేగవంతం కావడానికి ఉపకరిస్తుంది. సైబర్‌క్రైం, డిజిటల్‌ లిటరసీ విషయంలోనూ మాస్టర్‌కార్డ్స్‌ తెలంగాణతో కలిసి పని చేయనుంది. 

చదవండి: తెలంగాణకి గుడ్‌న్యూస్ ! ఫెర్రింగ్‌ ఫార్మా మరో రూ.500 కోట్లు..

మరిన్ని వార్తలు