Telecom Service: టెలికాం సంస్థలకు భారీ షాక్‌! తగ్గిన స్థూల ఆదాయం!

6 May, 2022 11:30 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్‌ త్రైమాసికంలో టెలికం సంస్థల స్థూల ఆదాయం 2.64 శాతం క్షీణించింది. రూ. 69,695 కోట్లకు పరిమితమైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

అంతక్రితం ఏడాది డిసెంబర్‌ త్రైమాసికంలో టెల్కోల ఆదాయం రూ. 71,588 కోట్లు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) సుమారు 16 శాతం పెరిగి రూ. 47,623 కోట్ల నుంచి రూ. 55,151 కోట్లకు పెరిగింది. ఏజీఆర్‌ ఆధారంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకాలు, చార్జీలు మొదలైనవి ఆధారపడి ఉంటాయి. సమీక్షా కాలంలో ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు రూపంలో రూ. 4,541 కోట్లు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు (ఎస్‌యూసీ) రూ. 1,770 కోట్లు దఖలు పడ్డాయి. 

లైసెన్సు ఫీజు కలెక్షన్‌ 19.21 శాతం, ఎస్‌యూసీ వసూళ్లు 14.47 శాతం పెరిగాయి. రిలయన్స్‌ జియో ఏజీఆర్‌ అత్యధికంగా రూ. 19,064 కోట్లుగా నమోదు కాగా, భారతి ఎయిర్‌టెల్‌ది రూ. 4,484 కోట్లు, వొడాఫోన్‌ ఐడియాది రూ. 6.542 కోట్లుగా నమోదైంది. 2021 డిసెంబర్‌ ఆఖరు నాటికి మొత్తం టెలిఫోన్‌ యూజర్ల సంఖ్య 0.9 శాతం క్షీణించి రూ. 117.84 కోట్లకు పరిమితమైంది.    


 

మరిన్ని వార్తలు