పెరిగిన టెల్కోల ఆదాయం: టాప్‌లో ఎవరంటే?

28 Apr, 2021 13:20 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: టెలికం కంపెనీల ఆదాయం పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో టర్నోవరు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.27 శాతం వృద్ధితో రూ.71,588 కోట్లు నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్‌) 16.5 శాతం అధికమై రూ.47,623 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి సమకూరిన లైసెన్స్‌ ఫీజు 16.49 శాతం పెరిగి రూ.3,809 కోట్లకు చేరింది. అలాగే స్పెక్ట్రం వాడినందుకు వసూలైన రుసుం 22.22 శాతం హెచ్చి రూ.1,538 కోట్లు నమోదైంది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) ఈ గణాంకాలను వెల్లడించింది.

 రిలయన్స్‌ జియో రూ.17,181 కోట్లుతో టాప్‌లో ఉండగా, భారతి ఎయిర్‌టెల్‌ రూ.11,340 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.6,588 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,135 కోట్ల ఏజీఆర్‌ సాధించాయి. టాటా టెలిసర్వీసెస్ రూ. 584.1 కోట్లు, ఎంటిఎన్ఎల్ రూ .369.84 కోట్లును సాధించగా, మిగతా కంపెనీలు ఎజిఆర్‌ను 100 కోట్ల రూపాయల కన్నా తక్కువే సాధించాయి.  ఈ గణాంకాల ప్రకారం, ఏజీఆర్‌ ఆధారిత ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం వార్షిక ప్రాతిపదికన 85.07 రూపాయల నుండి 108.78 రూపాయలకు పెరిగింది. 

చదవండి:  కార్పొరేట్‌ వార్‌: సుప్రీంకోర్టుకు సైరస్‌ మిస్త్రీ 
వైర్‌లెస్‌ టెక్నాలజీ: భారీ పెట్టుబడులు

మరిన్ని వార్తలు