బుల్లితెర క్వీన్‌ ఏక్తా కపూర్‌ మరో ప్రయోగం

11 Nov, 2021 12:32 IST|Sakshi

ఏక్తా కపూర్‌తో రోపోసో జట్టు 

ముంబై: వీడియో షేరింగ్‌ సోషల్‌ మీడియా సంస్థ రోపోసో తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్‌ అధినేత ఏక్తా కపూర్‌తో చేతులు కలిపింది. ‘ఈకే’ బ్రాండ్‌ పేరిట గృహాలంకరణ, గృహోపకరణాలను ఆవిష్కరించింది. స్థానిక కళాకారులకు ఊతమిచ్చేందుకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించేందుకు ఇది తోడ్పడగలదని ఏక్తా కపూర్‌ తెలిపారు.

మొబైల్‌ అడ్వర్టైజింగ్‌ టెక్నాలజీ కంపెనీ ఇన్‌మొబీలో భాగమైన గ్లాన్స్‌కి రోపోసో అనుబంధ సంస్థగా ఉంది. కలెక్టివ్‌ ఆర్టిస్ట్స్‌ నెట్‌వర్క్, గ్లాన్స్‌ మధ్య జాయింట్‌ వెంచర్‌ సంస్థ అయిన గ్లాన్స్‌ కలెక్టివ్‌ ’ఈకే’ బ్రాండ్‌ కింద మొట్టమొదటి కలెక్షన్‌ అందిస్తోందని ఇన్‌మొబి సీఈవో నవీన్‌ తివారీ తెలిపారు. ఈ కేటలాగ్‌లో కుషన్‌ కవర్లు, వాల్‌ ఆర్ట్‌ మొదలైన ఉత్పత్తులు గ్లాన్స్, రోపోసో ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ధరలు రూ.299 నుంచి ప్రారంభమవుతాయి

మరిన్ని వార్తలు