పెద్ద ఇళ్లు కావాలి

29 Jan, 2022 06:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. ఎక్కువ విస్తీ ర్ణం ఉన్న గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌లు కొనసాగుతుండటంతో ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా పెద్ద సైజు గృహ ప్రాజెక్ట్‌లనే నిర్మిస్తున్నారు.

1,100 చ.అ. నుంచి 1,300 చ.అ.ల్లోని 2 బీహెచ్‌కే, 1,500 చ.అ. నుంచి 2,500 చ.అ.ల్లోని 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ ఏర్పడిం దని 99ఎకర్స్‌.కామ్‌ వెబ్‌పోర్టల్‌ సర్వేలో తేలింది. నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, కొం డాపూర్‌ వంటి  పశ్చిమ హైదరాబాద్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. మణికొండ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతా ల్లోని అద్దె గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

చందానగర్‌లో అద్దెల వృద్ధి 3.54 శాతం, టోలిచౌకీలో 3.42 శాతం, మియాపూర్‌లో 3.10 శాతం, మణికొండలో 3.34 శాతం, కూకట్‌పల్లిలో 3.04 శాతం, గచ్చిబౌలిలో 2.98 శాతం, కొండాపూర్‌లో 3.11 శాతం, హైటెక్‌సిటీలో 3.15 శా తంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 12 వేల ఇన్వెంటరీ ఉంది. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో గృహాల ధరలు పెరిగాయి. రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలకు పెరిగాయి. 

మరిన్ని వార్తలు