చంద్రుడిని ట్రాఫిక్‌ లైట్‌గా అనుకుని.. ఇది సీరియస్‌ ఇష్యూనే!

25 Jul, 2021 07:31 IST|Sakshi

కమర్షియల్‌ అండ్‌ హెవీ వెహికిల్స్‌ తయారీ రంగంలో దిగ్గజంగా టెస్లాకు ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. సిలికాన్‌ వ్యాలీని బేస్‌ చేసుకుని నడుస్తున్న టెస్లా.. రెండు అమెరికా ఖండాల్లో భారీ బిజినెస్‌ చేస్తోంది. అయితే టెస్లా నుంచి డ్రైవర్‌లెస్‌ కార్‌ ఎప్పుడెప్పుడొస్తుందా? అని అంతా ఆత్రుతంగా ఎదురుచూస్తుండగా.. అది అంత వీజీ కాదని తేల్చేశాడు కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌. ఈ తరుణంలో టెస్లా టెక్నాలజీపైనే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

తాజాగా టెస్లా టెక్నాలజీలో డొల్లతనం బయటపడింది. టెస్లా ఆటోపైలెట్‌ సిస్టమ్‌ టెక్నాలజీ వెళ్తున్న ఓ కారు.. చంద్రుడిని ట్రాఫిక్‌ సిగ్నల్‌గా పొరపడి వేగంగా వెళ్తున్న కారు కాస్త నిదానించింది. ఓ టెస్లా కస్టమర్‌ ఈ పోస్ట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి మస్క్‌కి ట్యాగ్‌ చేశాడు. ఇదేం సాధారణమైన సమస్య కాదని, కచ్చితంగా ఇదో సంక్లిష్టమైన సమస్యేనని పేర్కొన్నాడతను.

తన టెస్లా కంపెనీ కారులో ఈ ఆటోపైలెట్‌ సిస్టమ్‌ డివైజ్‌ను ఉంచాడతను. చంద్రుడి రంగును చూసి ఎల్లో ట్రాఫిక్‌ లైట్‌గా చూపిస్తూ.. నిదానించింది కారు. దీంతో అతను ఫిర్యాదు చేశాడు. సుమారు పది వేల డాలర్లు విలువ చేసే ఈ టెక్నాలజీని వంద నుంచి రెండొదల డాలర్ల ఈఎంఐపై కూడా అదిస్తోంది టెస్లా. అయితే మొదటి నుంచి ఈ ఆటోపైలెట్‌ సిస్టమ్‌ సమస్యలకు కారణమవుతూ వస్తోంది. పార్క్‌డ్‌ లైన్లను గుర్తించకపోవడం, ముందు వెహికిల్స్‌ ఉన్నప్పుడు నిదానించి మరీ ఢీకొట్టడం లాంటి ఎన్నో సవాళ్లు కస్టమర్లకు ఎదురవుతున్నాయి. కానీ, బోస్టన్‌, ఫిలడెల్ఫియా లాంటి ప్రాంతాల్లో టెస్లా కస్టమర్లకు ఎలాంటి సమస్యలు ఎదురు కావడం లేదని, అయినప్పటికీ టెక్నికల్‌ ఇష్యూస్‌ను సాల్వ్‌ చేస్తామని ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది కంపెనీ.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు