అంతా నా ఇష్టం, 7లక్షల కోట్లు ఆవిరి

22 Jul, 2021 11:30 IST|Sakshi

తన మాటలతో బిజినెస్‌ ప్రపంచాన్ని శాసించే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లాకు చెందిన కార్లను కొనుగోలు చేసేందుకు బిట్‌కాయిన్ల(క్రిప్టో)ను అనుమతిస్తున్నట్లు ప్రకటించి మరోసారి హాట్‌ టాపిగ్గా మారారు. అయితే ఇదే బిట్‌ కాయిన్‌ ట్రాన్సాక్షన్లను వ్యతిరేకిస్తూ మే13 ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ దెబ్బకు బిట్‌ కాయిన్‌ విలువ 15శాతం క్షీణించింది 56 వేల డాలర్ల నుంచి ఒక్కసారిగా 46వేల డాలర్లకు పడిపోయింది. దీంతో క్రిప్టో పెట్టుబడిదారులు కంగుతిన్నారు. 

తాజాగా క్రిప్టోకి సపోర్ట్‌ చేస్తూ ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌ మేనేజ్మెంట్‌కు చెందిన 'ఏఆర్‌కే ఇన‍్వెస్ట్‌మెంట్‌ మేనేజ‍్మెంట్‌' సంస్థ ఆర్థిక సాధికారత సాధనంగా బిట్‌కాయిన్(Bitcoin as a Tool for Economic Empowerment) అనే అంశంపై చర్చించింది. ఈ చర్చలో పాల్గొన్న మస్క్‌ బిట్‌ కాయన్‌ పై ప్రకటన చేశారు. 
 

7లక్షల కోట్లు ఆవిరి

ఏప్రిల్‌ నెల ప్రారంభంలో  65,000 డాలర్లుగా ఉన్న బిట్‌ కాయిన్‌ ధర.. ఏప్రిల్‌ 19(సోమవారం) రాత్రి 30వేల డాలర్లకు పడిపోయింది. దీంతో రూ.7 ల‌క్ష‌ల కోట్ల (98 బిలియ‌న్ల డాల‌ర్లు) మేర‌కు న‌ష్ట‌పోయారు. అయితే రెండు రోజుల పాటు అలాగే కొనసాగినా గురువారం మార్కెట్‌లో 6.3 శాతం పెరగడంతో క్రిప్టో విలువ 31,547.88 డాలర్లకు చేరింది. ఇప్పుడు మరోసారి క్రిప్టో విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో క్రిప్టోవిలువ భారీగా పడిపోయినా ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ ప్రకటనతో తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

 చదవండి: ఐఆర్‌సీటీసీలో నెలకు రూ.30 - 80 వేలు సంపాదించండిలా !

మరిన్ని వార్తలు