సత్య నాదెళ్లతో సమస్యలు చెప్పుకున్న 'మస్క్' - ట్వీట్స్ వైరల్..

27 Feb, 2024 12:50 IST|Sakshi

టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇటీవల ఓ కొత్త విండోస్ ల్యాప్‌టాప్ పీసీ కొనుగోలు చేశారు. అయితే ఇందులో తాను ఎదుర్కొన్న సమస్యలను గురించి వివరిస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'కు తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.

పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌లలో బేసిక్ ఫంక్షనాలిటీ కోసం కూడా మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరాన్ని మస్క్ విమర్శించారు. నా కంప్యూటర్‌కి ఏఐ యాక్సెస్ ఇవ్వడానికి ముందుగా సైన్ ఇన్ చేయడానికి స్కిప్ చేయడం లేదా మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఒక ఆప్షన్‌గా ఉందని మస్క్ పేర్కొన్నారు.

వరుస ట్వీట్స్ తర్వాత, ఓకే యూజర్ చెప్పినట్లు.. మైక్రోసాఫ్ట్ ఖాతాను క్రియేట్ చేయకుండానే విండోస్ ల్యాప్‌టాప్‌ పీసీ యాక్సెస్ చేయగలిగినట్లు మస్క్ వెల్లడించారు. నా ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ లేకుండా వైఫైకి కనెక్ట్ అయినట్లు పేర్కొన్నారు. ఇలాన్ మాస్క్ సంభాషణ మొత్తం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ వుతోంది.

ఇదీ చదవండి: పేటీఎం బాస్ 'విజయ్ శేఖర్ శర్మ' రాజీనామా.. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీరే..

whatsapp channel

మరిన్ని వార్తలు