Tesla: టెస్లాకు వెయ్యికోట్ల జరిమానా, 'మై లార్డ్'..ఒక్కసారి ఆలోచించండి

18 Nov, 2021 16:00 IST|Sakshi

టెస్లాలో జాత్యంహాకర దాడుల అంశంపై ఎలన్‌ మస్క్‌ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్‌ కోర్ట్‌ను ఆశ్రయించారు. టెస్లా కంపెనీలో జాత్యంహాకర దాడులపై నమోదైన కేసు విషయంలో కోర్టులోని  జ్యూరీ బృందం ఇచ్చిన తీర్పుపై పున:పరిశీలించాలని కోరారు.  

బాధితుడికి అనుకూలంగా తీర్పు
టెస్లా కంపెనీ ఫ్రీమాంట్‌ ప్లాంట్‌లో ఓవెన్ డియాజ్ అనే నల్లజాతీయుడు 2015 నుంచి 2016 వరకు పనిచేశాడు. పనిచేస్తోన్న సమయంలో మాజీ కాంట్రాక్ట్ ఎలివేటర్ ఆపరేటర్‌ వైట్‌ అమెరికన్లు తనని నిగ్గర్ (అమెరికన్‌లు నల్లజాతీయుల్ని వ్యతిరేకించడం) అని ఏడిపించాడు. వర్క్‌ప్లేస్‌లో జాత్యహంకార వ్యంగ్యంగా బొమ్మల్ని గీసారని, బాత్రూమ్ స్టాల్‌లో నల్లజాతియుల్ని దూషించేలా స్లోగన్‌లు రాశారని, గోబ్యాక్‌ ఆఫ్రికా అంటూ వేధించారని ఆరోపించాడు. అయితే జాత్యంహకార వ్యాఖ్యలపై క్షోభకు గురైన ఓవెన్‌ డియాజ్‌ కోర్డును ఆశ్రయించాడు. దీంతో విచారణ చేపట్టిన కోర్ట్‌ అక్టోబర్‌ 4న ఓవెన్‌ డియాజ్‌కు అనుకూలంగా తుది తీర్పును వెలువరించింది. 

137మిలియన్ల నష్టపరిహారం 
ఈ ఏడాది అక్టోబర్‌ 4న  శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జ్యూరీ సభ్యులు ఇచ్చిన తీర్పులో టెస్లా కాలిఫోర్నియా ఫ్యాక్టరీలో జాత్యహంకార వేధింపులను కంపెనీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లజాతీయుడు ఓవెన్‌ డియాజ్‌కు $137 మిలియన్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై తాజాగా టెస్లా కోర్ట్‌ తీర్పును సవాలు చేసింది. కోర్టు తీర్పు టెస్లాను అస్థిరపరిచేలా ఉందని, నిర్ణయాన్ని పున:పరిశీలించాలని న్యాయమూర్తిని కోరింది. ప్రత్యామ్నాయంగా న్యాయస్థానం విధించిన $137(భారత కరెన్సీలో రూ.10,17,98,67,200.00) మిలియన్ల నష్టపరిహారం కాకుండా $300,000 డాలర్లు చెల్లిస్తామని వాదించినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో తెలిపింది. అంతేకాదు టెస్లా డియాజ్ ఫిర్యాదు పై తమ సంస్థ కార్మికులను క్రమశిక్షణగా ఉంచుతుందని, ఫిర్యాదు దారుడు చేసిన ఆరోపణల‍్లో ఆధారాలు లేవని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొం‍ది. 

చదవండి: ఎలన్‌ మస్క్‌ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు