Elon Musk: ట్విటర్‌ ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన ఎలాన్‌ మస్క్‌

22 Aug, 2022 17:09 IST|Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్ వ్యాపారవేత్త, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌తన ట్విటర్‌ ఫాలోవర్‌, భారతదేశానికి చెందిన తన చిరకాల మిత్రుడిని సర్‌ప్రైజ్‌ చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నసాఫ్ట్‌వేర్ డెవలపర్ ప్రణయ్ పాథోల్‌ను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాథోల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. (Radhakishan Damani: ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్‌ బాధ్యతలు ‘గురువు’ గారికే!)

టెక్సాస్‌లో గిగాఫ్యాక్టరీలో మస్క్‌ను కలుసుకున్న ఒక పిక్‌ను ట్వీట్‌ చేశారు. “గిగాఫాక్టరీ టెక్సాస్‌లో మస్క్‌ను కలవడం చాలా గొప్ప విషయం. లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మీరు. ఇంతనిరాడంబరమైన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు’’ అంటూ  తన అనుభవాన్ని షేర్‌ చేశారు.  దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది . 'డౌన్ టు ఎర్త్'  అంటూ  కామెంట్‌ చేసిన పలువురు నెటిజన్లు పాథోల్‌ను అభినందించారు. (Galaxy z flip 4 & Fold 4: డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..)

ఇది ఇలా ఉంటే..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, టెస్లా ఫుల్‌ సెల్ఫ్‌-డ్రైవింగ్ అనే డ్రైవర్-హెల్ప్‌ఫీచర్స్‌‌ ధరను 15వేల డాలర్లు పెంచేసింది. వివాదాస్పద ఉత్పత్తి ధరను పెంచడం ఈ ఏడాదిలో ఇది  రెండోసారి. ఉత్తర అమెరికాలోని కస్టమర్లకు పెంపుదల సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తుందని ఎలాన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. ప్రస్తుత  దీని ధర 12వేల డాలర్లుమాత్రమే. 

మరిన్ని వార్తలు