టెస్లా ఉద్యోగులు: ఎలన్‌ మస్క్‌ నీ పద్దతి మార్చుకో..లేదంటే నీకే నష్టం!

17 Jun, 2022 18:20 IST|Sakshi

టెస్లా మాజీ ఉద్యోగులు ఆ సంస్థ సీఈవో ఎలన్‌ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పట్ల వ్యవహరించే తీరు మార్చుకోవాలని, లేదంటే అది సంస్థకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతుందని ఉద్యోగులు ఇంటర్నల్‌ చాట్‌ సిస్టం (ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్‌ వ్యవస్థ)లో మస్క్‌పై దుమ్మెత్తిపోశారు. బహిరంగంగా ఓపెన్‌ లెటర్‌ను విడుదల చేశారు. 

ఉద్యోగులు విడుదల చేసిన ఓపెన్‌ లెటర్‌లో ఎలన్‌ మస్క్‌ తీరు ఎలా ఉందో వివరించారు. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా తమని ఇబ్బందులకు గురి చేసినట్లు అందులో వాపోయారు. అంతేకాదు మస్క్‌తో పాటు టెస్లా సంస్థ సైతం తెలివి తక్కువగా నిర్ణయాలు తీసుకుంటూ ట్విట్టర్‌ ప్రతిష్టను మరింత దిగజార్చే ప్రయత్నం చేసినట్లు చెప్పారు.

అందుకే మస్క్‌ విమర్శల్ని ప్రతి ఘటిస్తూ ట్విట్టర్‌ యాజమాన్యం సమాధానం చెప్పాలని అన్నారు. అదే సమయంలో "స్పేస్‌ఎక్స్‌ స్పోక్‌ పర్సన్‌గా ఉన్న ఎలన్‌ మస్క్‌ చేసే అసందర్భ వ్యాఖ్యలు తాము చేసే, చేస్తున్న వర్క్‌పై లేదంటే మా లక్ష్యాలపై, విలువలపై ప్రతిబింబిచవు" అని ఇంటర్నల్‌ చాట్‌ సిస్టంలో షేర్‌ చేసిన ఓపెన్‌ లెటర్‌లో ఉద్యోగులు స్పష్టం చేశారు.

న్యూయార్స్‌ టైమ్స్‌ కథనం
న్యూయార్స్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. టెస్లా ప్రెసిడెంట్‌ గ్విన్ షాట్‌వెల్ ఉద్యోగుల్ని తొలగిస్తూ ఓ లెటర్‌ను విడుదల చేశారు. కానీ ఎంతమంది ఉద్యోగుల్ని బలవంతంగా బయటకు పంపించిందనే విషయం వెలుగులోకి రాలేదు.

చదవండి👉 ఎలన్‌ మస్క్‌ ఆగమాగం, మంచు పర్వతంలా కరిగిపోతున్న ఆస్తులు!

మరిన్ని వార్తలు