స్కిల్స్‌ లేనోళ్లు మాకెందుకు..వందల మంది టెస్లా ఉద్యోగుల తొలగింపు!

15 Jul, 2022 09:42 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్‌ దిగ్గజం టెస్లా సంస్థ ఉద్యోగులు తొలగింపు కొనసాగుతుంది. తక్కువ జీతం, తక్కువ స్కిల్‌ ఉన్న 229 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించినట్లు టెస్లా సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 

కాలిఫోర్నియాలోని  టెస్లా ఆఫీస్‌ సెయింట్ మాథ్యూలో టెస్లా కారు ఆటో పైలెట్‌ విభాగంలో మొత్తం 276మంది ఉద్యోగులు పనిచేస‍్తున్నారు. అయితే తాజాగా 276మందిలో 229 మంది ఉద్యోగులకు స్కిల్స్‌ లేవంటూ టెస్లా వారిని ఇంటికి పంపించేసింది. మిగిలిన 47మంది ఉద్యోగుల్ని టెస్లా బఫెల్లో ఆటోపైలెట్‌ విభాగానికి షిఫ్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది

స్కిల్స్‌ లేనోళ్లతో మాకేం పని
ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో టెస్లా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డైరెక్టర్‌ ఆండ్రెజ్ కర్పతి స్పందించారు. తొలగించిన ఆటోపైలెట్‌ ఉద్యోగులకు ఏం వర్క్‌ చేస్తున్నాం. ఏం వర్క్‌ చేయబోతున్నామనే విషయంలో స్పష్టత లేదు. అయితే లాంగ్‌ టర్మ్‌ విజన్‌ ఉండేందుకు ఏఐ మీద ఎక్కువ టైం స్పెండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామంటూ  ఉద్యోగుల్ని ఎందుకు తొలగించారనే అంశంపై దాటవేత ధోరణిలో మాట్లాడారు.  

ఇదో వ్యూహం
ఇటీవల కతర్ ఎకనమిక్‌ ఫోరంలో టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ రానున్న 3 నెలల్లో టెస్లాకు చెందిన 10శాతం మంది ఉద్యోగులపై కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా టెస్లాలో ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు 3.5శాతం తగ్గిపోనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు ఊతం ఇచ్చేలా టెస్లా ఉద్యోగుల తొలగింపు అనివార్యమైంది.

మరిన్ని వార్తలు