టెస్లా ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ భారీ షాక్‌

21 Dec, 2022 21:46 IST|Sakshi

ఎలాన్‌ మస్క్‌ ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ట్విటర్‌ కొనుగోలు తర్వాత ఎలక్ట్రిక్‌ కార్ల తయారీని సంస్థ టెస్లాను పట్టించుకోవడమే మానేశారు. దీంతో ఆ సంస్థకు నష్టాల స్వాగతం పలికాయి. తాజాగా టెస్లా షేర్లు అమ్మకాలతో మస్క్‌ సంపదతో మంగళవారం ఒక్క రోజే  7.7 బిలియన్‌ డాలర్లు ( రూ.63.72 వేల కోట్లు) ఆవిరయ్యాయి. ఈ ఏడాది మస్క్‌ సంపద 122.6 బిలియన్‌ డాలర్లు తరిగింది. 

ఈ తరుణంలో మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే త్రైమాసికంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారీగా ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

కాగా,అక్టోబరులో 44 బిలియన్‌ డాలర్ల కొనుగోలు అనంతరం ట్విటర్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టడంపై టెస్లా పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో సైతం కోవిడ్‌-19 దెబ్బకు టెస్లా కార్ల డిమాండ్‌ తగ్గింది. డిమాండ్‌లో తగ్గడంతో ఈవీ తయారీదారుల డెలివరీలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనతో పెట్టుబడిదారులు టెస్లా స్టాక్‌లో పెట్టుబుడులను నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని గతంలోనే చెప్పిన మస్క్‌ అందుకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు