Twitter Effect: టెస్లాకు భారీ షాక్‌.. ఇబ్బందులు తప్పవా?

27 Apr, 2022 09:34 IST|Sakshi

టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. ట్విటర్‌ను రూ.3.36లక్షల కోట్ల(44 బిలయన్‌ డాలర్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కొనుగోళ్లలో భాగంగా ట్విటర్‌ సంస్థకు 21బిలియన్‌ డాలర్లను చెల్లించాల్సి ఉండగా..ఇందుకోసం మస్క్‌ టెస్లా షేర్లను అమ్మేస్తారనే ఊహాగానాల మధ్య పెట్టుబడు దారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం టెస్లా 126 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవి చూసింది. ఒకవేళ టెస్లా షేర్లు అమ్మితే..మస్క్‌ ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.  

మస్క్‌కి డబ్బులెక్కడివి!
ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ డీల్‌కు టెస్లా కంపెనీకి సంబంధం లేదు. పైగా మస్క్‌ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ట్విటర్‌కు చెల్లించాల్సిన మొత‍్తాన్ని ఎక్కడి నుంచి తెస్తారు. ఇదిగో ఇలాంటి ఎన్నో అనుమానాలు టెస్లా ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమయ్యాయి. ఆ భయాలతో టెస్లా షేర్‌ వ్యాల్యూ భారీగా 12.2శాతం పడిపోయింది. ఈ సందర్భంగా వెబ్‌డష్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌ డేనియల్‌ ఇవ్స్‌ మాట్లాడుతూ..మస్క్‌..ట్విటర్‌ను కొనుగోలు చేయడం..ట్విటర్‌కు చెల్లించేందుకు టెస్లా షేర్లను అమ్మేస్తారనే వార్తల నేపథ్యంలో టెస్లా షేర్లు నష్టపోవడానికి కారణమైందని అన్నారు.

టెస్లా షేర్లు పడిపోవడానికి మరో కారణంగా 
టెస్లా షేర్ల పతనానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఎకానమీన మందగించడం, యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదలపై పెట్టుబడి దారుల ఆందోళన మరో కారణమని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో నెలకొన్ని అనిశ్చితి కారణంగా మంగళవారం అమెరిన్‌ స్టాక్‌ మార్కెట్‌ నాస్‌డాక్‌ డిసెంబర్ 2020 నుండి నాస్‌డాక్ దాని కనిష్ట స్థాయి వద్ద  ముగిసింది.

ట్విటర్‌ లాస్‌ 
మస్క్‌ ట్విటర్‌ డీల్‌ నేపథ్యంలో ట్విటర్‌ షేర్‌లు భారీగా నష్టపోయాయి. 3.9శాతం పడిపోయి $49.68 వద్ద ముగిశాయి. అయినప్పటికీ మస్క్ సోమవారం ప్రతి షేరును నగదు రూపంలో $54.20కి కొనుగోలు చేయడానికి అంగీకరించడారు. మస్క్ తన $239 బిలియన్ల సంపదలో మెజారిటీ టెస్లా షేర్లే. ట్విటర్‌ను కొనుగోలుతో పెట్టుబడి దారులు అందోళన చెందడం.. ఆ ప్రభావం టెస్లా షేర్లపై పడినట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

 

అప్పు చేసి పప్పుకూడు 
ఒప్పందంలో భాగంగా మస్క్ ఇప్పటికే తన టెస్లాలోని $12.5 బిలియన్ మార్జిన్ రుణాన్ని కూడా తీసుకున్నాడు. పైగా ఇప్పుడు మరిన్ని టెస్లా షేర్లు అమ్మడం పెట్టుబడి దారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అప్పు చేసి ట్విటర్‌ను కొనుగోలు చేయడంతో టెస్లా షేర్లు పడిపోయాయని,"టెస్లా షేరు ధర ఫ్రీఫాల్‌లో కొనసాగితే మస్క్‌కు ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఓఏఎన్డీఏ సీనియర్ మార్కెట్ అనలిస్ట్‌ ఎడ్ మోయా అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి👉సంచ‌ల‌నం! ట్విట‌ర్‌ను కొనుగోలు చేసిన ఎల‌న్ మ‌స్క్‌!

మరిన్ని వార్తలు