Tesla Semi Truck: ఎలన్‌ మస్క్‌ చాపకింద నీరులా.. రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ ఎలక్ట్రిక్‌ ట్రక్‌లు

9 Nov, 2021 15:44 IST|Sakshi

టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌ గురించి, ఆయన ప్రతిభాపాటవాలు' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వైపు అంతరిక్షంపై మానవుని మనగడ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు ఎలక్ట్రిక్‌ రంగంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు చాపకింద నీరులా సెమీ ఎలక్ట్రిక్‌ ట్రక్‌లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.  

ఉద్గారాలను తగ్గించేందుకే 
మనం ఇప్పటి వరకు రోడ్లపై తిరిగే ఎలక్ట్రిక్‌ బైక్స్‌, కార్లను, బస్సులను మాత్రమే చూసుంటాం. కానీ ఇకపై ఎలక్ట్రిక్‌ సెమీ ట్రక్‌లు రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ సందడి చేయనున్నాయి. టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌ ప్రముఖ  బెవరేజెస్ కంపెనీ పెప్సికో'కి తొలిసారి టెస్లా సెమీ ట్రక్‌లను తయారు చేశారు. త్వరలోనే సెమీ ట్రక్‌లను ఈవీ మార్కెట్‌కు పరిచయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెప్సికో సీఈఓ రామన్‌ లగుర్టా సీఎన్‌బీసీతో మాట్లాడుతూ..పెప్సికో సంస్థ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున‍్నట్లు తెలిపారు. ప్రయత్నాల్లో భాగంగా ఎలక్ట్రిక్‌ 2017లోనే సెమీ ట్రక్‌లను తయారు చేసే ప్రాజెక్ట్‌ను టెస్లాకు అప్పగించినట్లు వెల్లడించారు.  


2017లోనే 100 సెమీ ట్రక్‌లకు ఆర్డర్‌ 
ఎలన్‌ మస్క్‌ సంబంధించి బయటి ప్రపంచానికి కేవలం ఎలక్ట్రిక్‌ కార్ల గురించి మాత్రమే తెలుసు. కానీ తొలిసారి సెమీ ఎలక్ట్రిక్‌ ట్రక్‌లను తయారు చేయడంలో 2017నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. 2017లోనే పెప్సికో కంపెనీ ఎలన్‌ మస్క్‌కు 100 సెమీ ఎలక్ట్రిక్‌ ట్రక్‌లను తయారు చేసే బాధ్యత అప్పగించినట్లు రామన్‌ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు టెస్లా సెమీ ఎలక్ట్రిక్‌ ట్రక్‌లను తయారు చేసిందని, వాటిని ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తమకి అప్పగిస్తున్నట్లు చెప్పారు. 

ఎలన్‌ మాట తప్పాడు


ఎలన్‌ మస్క్‌ ఈ సెమీ ఎలక్ట్రిక్‌ ట్రక్‌లను 2020 నాటికే పెప్సికోకి అందిస్తామని మాటిచ్చారు. కానీ బ్యాటరీతో పాటు, సప్లయి చైన్‌ సంబంధిత రంగాల్లో మార్కెట్‌ డిమాండ్‌ కారణంగా సెమీ ట్రక్‌లను అందించే విషయంలో ఎలన్‌ మాట తప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ట్రక్‌లను విడుదల తేదీలను వాయిదా వేసిన మస్క్‌ ఈ ఏడాది జులైలో మరోసారి ప్రకటించారు. 2022 సెమీ ట్రక్‌లను లాంఛ్‌ చేస్తామని ప్రకటించారు. పెప్సీకో మాత్రం ఈ ఏడాది చివరి నాటికి కనీసం 15 ఎలక్ట్రిక్‌ ట్రక్‌లను టెస్లా నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తుండగా.. టెస్లా ట్రక్‌ల కొనుగోలు కోసం మరికొన్ని దిగ్గజ కంపెనీలు క్యూకడుతున్నాయి.  

క్యూ కడుతున్న కంపెనీలు 
ఎలన్‌ మస్క్‌ తయారు చేస్తున్న సెమీ ఎలక్ట్రిక్‌  150,000 డాలర్ల నుంచి 180,000 మధ్యలో ఉంది. అయితే వీటిని కొనుగోలు కోసం వాల్‌మార్ట్‌, ఫెడ్‌ఎక్స్‌, అన్హ్యూసర్ బుష్ దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. 

చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు

మరిన్ని వార్తలు