భారత్‌లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

19 Apr, 2022 03:58 IST|Sakshi

మూడేళ్లలో టెస్లా పవర్‌ ప్రణాళికలు

న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో 1 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ. 7,500 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు టెస్ల పవర్‌ యూఎస్‌ఏ వెల్లడించింది. పవర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (పాస్‌) కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు సంస్థ చైర్మన్‌ జాన్‌ హెచ్‌ రట్సినస్‌ తెలిపారు. భారత్‌లో విద్యుత్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీ వినియోగదారులకు బ్యాటరీలు, విద్యుత్‌ స్టోరేజీ సొల్యూషన్స్‌ అందించేందుకు ’పాస్‌’ విధానం ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ’మిషన్‌ 1,000’ కార్యాచరణ ప్రణాళికను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2022–23లో రూ. 1,000 కోట్ల టర్నోవరు, 1,000 క్లయింట్లు, అదే స్థాయిలో ఎక్స్‌క్లూజివ్‌ టెస్లా షాప్స్‌ (సేల్స్, సర్వీస్‌ సెంటర్లు) ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు టెస్లా పవర్‌ యూఎస్‌ఏ ఎండీ కవీందర్‌ ఖురానా తెలిపారు.

మరిన్ని వార్తలు