టెస్లా కార్ల‌లో క‌లక‌లం, 8ల‌క్ష‌ల కార్ల‌కు పైగా!!

5 Feb, 2022 12:42 IST|Sakshi

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ దిగ్గ‌జం టెస్లాకు మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. టెస్లా కార్ల‌లో సాంకేతిక లోపం తలెత్తిన కార‌ణంగా సుమారు 8.17ల‌క్షల కార్లకు పై రీకాల్ చేయాల‌ని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్ఏ) విభాగం ఆదేశాలు జారీ చేసింది. 

ఎస్​ సెడాన్​, మోడల్​ ఎక్స్ ఎస్​యూవీ, మోడల్​ 3, మోడల్ వై ఎస్​యూవీ వాహనాల డ్రైవింగ్ స‌మ‌యంలో సీట్ బెల్ట్ రిమైండ్ చేయ‌డం స‌మ‌స్య తెలత్తిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగే ప్ర‌మాదం ఎక్కువ ఉంటుంద‌నే కార‌ణంతో సుమారు.8,17,000 కార్ల‌ను రీకాల్ చేయాల‌ని ఎన్ హెచ్ టీఎస్ ఏ అధికారులు టెస్లాను ఆదేశించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన టెస్లా కార్లకు సంబంధించిన లోపాల్ని స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించి వాహ‌న‌దారుల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపింది. 


సిగ్న‌ల్ ప‌డినా దూసుకొని వెళ్తున్నాయ్‌

కొద్ది రోజుల క్రితం ఇదే టెస్లాకు చెందిన 54వేల‌ కార్లలో సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో  సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. రెడ్ సిగ్న‌ల్ ప‌డినా టెస్లా కార్లు ర‌య్ మంటూ దూసుకెళ్లాయి. దీంతో టెస్లా కార్లలో భ‌ద్ర‌త ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింద‌ని, వెంట‌నే ఆ కార్ల‌ను రీకాల్ చేయాల‌ని అమెరికా  ర‌క్ష‌ణ నియంత్ర‌ణ సంస్థ టెస్లా సంస్థ‌కు నోటీసులు జారీ చేసింది. కాగా, టెస్లా మాత్రం త‌మ కార్ల‌లో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌లేద‌ని తెలిపింది. వెంట‌నే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చింది.

మరిన్ని వార్తలు