హింట్‌ ఇచ్చేసిందిగా, ఇండియన్‌ రోడ్లపై టెస్లా చక్కర్లు

23 Jul, 2021 11:40 IST|Sakshi

దేశియ రోడ్లపై టెస్లాకార్లు రయ్‌.. రయ్‌ మంటూ ఎప్పుడు తిరుగుతాయా అని ఎదురు చూస‍్తున్న అభిమానులకు టెస్లా శుభవార్త చెప్పింది. యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌లో హిందీ లాంగ్వేజ్‌ను యాడ్‌ చేసింది.

 దేశంలో చమురు ధరలు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఈవీ మార్కెట్‌ పై కన్నేసిన ఆటోమొబైల్‌ సంస్థలు ఈవీ వాహనాల్ని తయారు చేసి, భారత్‌ లో విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రముఖ ఈవీ వెహికల్‌ టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ త్వరలో భారత్‌లో టెస్లా కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస‍్తోంది. 

యూఐలో హిందీ లాంగ్వేజ్‌

ఇప్పటికే భారత్‌ లో ఐటీహబ్‌ గా పేరొందిన బెంగళూరు కేంద్రంగా టెస్లా ఇండియా పేరుతో ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి హెడ్‌ గా ప్రశాంత్‌ ఆర్‌.మీనన్‌ ను ఎంపిక చేశారు. ప్రశాంత్‌ మీనన్‌ సైతం టెస్లా కార్లను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా టెస్లా కార్‌ యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌(UI)లో రష్యన్‌,గ్రీక్‌,ఫిన్నిష్ క్రొయేషియన్ లాంగ్వేజ్‌తో పాటు హిందీ లాంగ్వేజ్‌ను యాడ్‌ చేసింది. దీంతో ఇండియన్‌ ఆటోమొబైల్‌ నిపుణులు టెస్లా కారు ఇండియన్‌రోడ్లపై తిరిగే సమయం దగ్గరలోనే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

భారత్‌లో టెస్లా మోడల్‌ 3

కొద్ది రోజుల క్రితం భారత్‌లో టెస్లా మోడల్‌ 3 కార్‌ ట్రయల్స్‌ నిర్వహించారు.ఈ ట్రయల్స్‌లో రోడ్లపై టెస్లా కార్ల డ్రైవింగ్‌ సులభంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు నిర్ధారించారు. దీంతో టెస్లా మోడల్‌-3 రెడ్‌ కలర్‌ కార్‌ను బెంగళూరులో డెలివరీ చేసింది. భారత్‌లో తొలిసారి విడుదల చేయనున్న ఈ కారు ధర రూ.70 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. టెస్లా మోడల్ -3 అమెరికన్‌ మార్కెట్లో ప్రారంభ ధర సుమారు రూ .30 లక్షలు ($ 39,990) కు విక్రయిస్తున్నారు. కార్లపై అధిక కస్టమ్స్ సుంకం విధించడం వల్ల, భారత్‌ కు వచ్చే  టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ .70 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.           
   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు